పీకేది పెద్ద ప్రయత్నమేనట

అందరినీ ఏకం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. జనతాదళ్ యు [more]

Update: 2020-02-24 17:30 GMT

అందరినీ ఏకం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. జనతాదళ్ యు నుంచి సస్పెండ్ కు గురైన ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన వ్యూహాలేంటో బీజేపీకి మరోసారి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే బీహార్ లో కూటమి ఏర్పాటుకు పెద్ద ప్రయత్నాన్ని ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు.

వ్యూహాలకు పదును….

బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జేడీయూ నుంచి సస్పెన్షన్ కు గురైన ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. నితీష్ కుమార్, బీజేపీలకు వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఇటీవల వివిధ పార్టీల ముఖ్యనేతలతో సమావేశమయిన ప్రశాంత్ కిషోర్ వారితో కూటమిపై చర్చించినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ తో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఆయన హిందూస్థాన్ ఆవామ్ మోర్చా అధ్యక్షుడు. అలాగే ఆర్ఎస్ఎల్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహాతో కూడా ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు.

కూటమి ఏర్పాటుకు….

మరోసారి బీహార్ ఎన్నికల్లో మహాగడ్బంధన్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. మహాగడ్బంధన్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రధాన పక్షాలు. ఎక్కువ స్థానాలను గెలుచుకునే సత్తా ఈ రెండు పార్టీలకే ఉంది. చిన్నా చితకా పార్టీలు కూటమిలో కలిసినా వాటి ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరమితమవ్వక తప్పదు. అయితే ఈసారి బీహార్ ఎన్నికల్లో అన్ని పార్టీలనూ ఏకం చేసి బీజేపీ కూటమిని దెబ్బతీయాలన్న లక్ష్యంతో వీరితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆర్జేడీ కూడా ప్రశాంత్ కిషోర్ సూచనను పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.

యువత టార్గెట్ గా….

ఇక ప్రశాంత్ కిషోర్ బీహారీ యువతను టార్గెట్ చేసినట్లు కన్పిస్తుంది. బాత్ కీ బీహార్ పేరుతో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సభ్యత్వ నమోదు నుకూడా స్టార్ట్ చేశారు. బీజేపీకి యువతను దూరం చేయగలిగితే సగం విజయం సాధించినట్లేనని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. ఉమ్మడి వేదిక ప్రయత్నాలు కూడా మరోవైపు ప్రారంభించారు. అయితే కులాల కురుక్షేత్రంలా సాగే బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏమేరకు పనిచేస్తాయన్నది ప్రశ్నార్థకమే.

Tags:    

Similar News