ఇబ్బందులు రెడీగా ఉన్నాయా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి లక్ష్యంగా మారారనే చెప్పాలి. తమ పార్టీని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న ప్రశాంత్ కిషోర్ ను కట్టడి చేయాలన్న [more]

Update: 2020-02-23 17:30 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి లక్ష్యంగా మారారనే చెప్పాలి. తమ పార్టీని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న ప్రశాంత్ కిషోర్ ను కట్టడి చేయాలన్న ఉద్దేశ్యంతోనే కమలనాధులున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమై తమను దెబ్బతీస్తున్నారన్న భావన బీజేపీలో బలంగా నాటుకు పోయింది. అనేక రాష్ట్రాల్లో తమను దెబ్బతీస్తున్న ప్రశాంత్ కిషోర్ ను వదలిపెట్టకూడదన్న నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లు హస్తినలో బలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఊరికే చేయరు….

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎవరు తనను రాజకీయంగా వ్యూహకర్తగా వినియోగించుకుంటే వారికి తమ సేవలందిస్తారు. అంటే ఊరికే కాదు. కోట్లలోనే ప్యాకేజీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 2019 జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ప్రశాంత్ కిషోర్ సేవలందించారు. దీనికి వంద కోట్ల ప్యాకేజీ అని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఐ ప్యాక్ పేరుతో…..

ప్రశాంత్ కిషోర్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) పేరుతో సంస్థను స్థాపించారు. వందల సంఖ్యలో ఇందులో ఉద్యోగులు పనిచేస్తుంటారు. సర్వేల కోసం ఐఐఎం, ఐఐటీ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటారు. ఏపీ తర్వాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి విజయం సాధించిపెట్టారు. ఇక పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కు సహకారం అందిస్తున్నారు. బీహార్ లో స్వయంగా తానే రంగంలోకి దిగుతానని ప్రకటించారు.

పన్నులు ఎగవేత….?

ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న ప్రశాంత్ కిషోర్ వ్యాపారంపై దాడులు జరిగే అవకాశముందని ఢిల్లీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కేవలం రాష్ట్రాల ఎన్నికలను మాత్రమే కాకుండా పౌరసత్వ చట్ట సవరణ విషయంలోనూ ప్రశాంత్ కిషోర్ బీజేపీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఐప్యాక్ సంస్థ పన్నులు సక్రమంగా చెల్లించడంలేదన్న ఆరోపణలు గతంలోనే విన్పించాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ లక్ష్యంగా ఆ కంపెనీపై ఐటీ దాడులు జరిగే అవకాశముందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News