Prasanth kishore : మకాం మార్చింది అందుకేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి పూర్తిగా తన మకాం మార్చినట్లే. ఆయన పశ్చిమ బెంగాల్ లో సెటిల్ అవుతున్నారు. రాజకీయంగా తనను బీహార్ ఆదుకోదని [more]

Update: 2021-10-01 16:30 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి పూర్తిగా తన మకాం మార్చినట్లే. ఆయన పశ్చిమ బెంగాల్ లో సెటిల్ అవుతున్నారు. రాజకీయంగా తనను బీహార్ ఆదుకోదని భావించిన ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ నే ఎంచుకున్నారు. ప్రశాంత్ కిషోర్ కు రాజకీయాల్లో రాణించాలని ఆశ. అయితే అందుకు అనుకూల అంశాలున్నాయి. ప్రతికూల అంశాలున్నాయి. కాని ప్రశాంత్ కిషోర్ గోల్ మాత్రం తాను ముఖ్యమంత్రి కావడమే.

ఎందరినో సీఎంలను చేసి…

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఎందరినో ముఖ్యమంత్రులను చేశారు. వారికి సేవలందించి అందుకు తగిన రుసుం వసూలు చేసినా పీకే పై రాజకీయ నేతలకు అంత నమ్మకముంది. ఏపీ, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇలా వరస విజయాలు ప్రశాంత్ కిషోర్ పేరు రాజకీయాల్లో మారుమోగుతుంది. అయితే ఆయనకు మాత్రం తాను రాజకీయాల్లో రాణించాలని బలమైన కోరిక అంటారు.

బీహార్ లో కుదరక….

అందుకే ప్రశాంత్ కిషోర్ తొలుత బీహార్ ను ఎంచుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేతకు వారసత్వం లేకపోవడంతో ఆ పార్టీ కీలక నేతగా పనిచేశారు. బీహార్ నుంచే తన రాజకీయం ప్రారంభమవుతుందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ లు చేయడంతో ఆయనను పార్టీ నుంచి తప్పించేశారు. దీంతో ఆయన బీహార్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆయన కన్పించలేదు.

బెంగాల్ పై మమకారం….

ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కు పశ్చిమ బెంగాల్ తనకు రాజకీయ వసతి కల్పిస్తుందని భావిస్తున్నారు. అందుకోసమే ఆయన బెంగాల్ లోని భవానీపూర్ లో ఓటు హక్కును పొందారు. ఇప్పటి వరకూ ప్రశాంత్ కిషోర్ బీహార్ లో ఓటు హక్కు కలిగి ఉన్నా దానిని బెంగాల్ కు మార్చుకున్నారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కూడా వారసులు లేకపోవడమే. మేనల్లుడు ఉన్నప్పటికీ తాను రాజకీయంగా రాణించడానికి బెంగాల్ ఉపయోపడుతుందని అంచనా వేస్తున్నారు. మరి బీహారీకి బెంగాల్ ప్రజలు ఎప్పటికైనా అండగా ఉంటారా? అంటే అది సందేహమే. మొత్తం మీద బెంగాల్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రశాంత్ కిషోర్ ప్రారంభిస్తారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News