పుణ్యం కట్టుకోవు పీకే?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిజిబిజీగా మారుతున్నారు. త్వరలో జరగనున్న అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీలూ ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు సాగిస్తున్నాయి. తమకు ఎన్నికల వ్యూహకర్తగా [more]

Update: 2019-09-28 17:30 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిజిబిజీగా మారుతున్నారు. త్వరలో జరగనున్న అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీలూ ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు సాగిస్తున్నాయి. తమకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించమని కోరుతున్నాయి. నిజానికి ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. ఆయన జనతాదళ్ యు అధ్యక్షులుగా ఉన్నారు. బీహార్ లో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఎక్కువగా ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయినా ప్రశాంత్ కిషోర్ టీం తమకు వస్తే చాలనని చాలా రాజకీయ పార్టీలు కోరుకుంటుండటం విశేషం.

వైసీపీకి ఘన విజయం తెచ్చిపెట్టి….

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీనికి పార్టీ అధినేత వైఎస్ జగన్ కృషితో పాటు ప్రశాంత్ కిషోర్ టీం శ్రమ ఉందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. నలభై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబును దారుణంగా ఓడించారు. దీంతో ప్రశాంత్ కిషోర్ ప్రతిభ దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మమత బెనర్జీ పార్టీకి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన టీం ఇప్పటికే బెంగాల్ లో పనిచేస్తుంది.

కమల్ హాసన్ కు కూడా….

ఇక మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సయితం ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కొంతకాలం క్రితం జరిపారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపైనే ఆయన ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్నట్లు తెలిసింది. కుమారుడిని రాజకీయంగా ఎలా గ్రౌండ్ చేయాలన్న చర్చే వీరి మధ్య జరిగిందని చెబుతున్నారు. ఇక తమిళనాడులోని కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ టీం తమిళనాట పర్యటిస్తోంది.

రజనీకాంత్ సమాలోచనలు….

ఇదిలా ఉండగానే తాజాగా తమిళనాట రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ముంబయిలో ప్రశాంత్ కిషోర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీకాంత్ 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగంలోకి దిగపోతున్నారు. తమిళనాడులో ఉన్న పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే అధ్యయనం చేసింది. ఆ అధ్యయన వివరాలను తెలుసుకునేందుకే ప్రశాంత్ కిషోర్ ను రజనీకాంత్ కలసి నట్లు చెబుతున్నారు. మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్నట్లుగా అన్ని రాష్ట్రాల్లోని పార్టీలూ ప్రశాంత్ కిషోర్ వ్యూహాల కోసం వెంటపడుతుండటం విశేషం. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పొలిటికల్ కారిడార్ లో లెజెండ్ గా మారారు.

Tags:    

Similar News