ప్రశాంత్ కిషోర్ కు ఎప్పుడూ అదే ధ్యాసా?

ఊరందరిదీ ఒకదారయితే ఉలిపికట్టెది మరొక దారి అన్నట్లుగా ఉంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం. వరస గెలుపులతో ఆయనలో అహం పెరిగినట్లే కన్పిస్తుంది. లాక్ డౌన్ [more]

Update: 2020-03-30 17:30 GMT

ఊరందరిదీ ఒకదారయితే ఉలిపికట్టెది మరొక దారి అన్నట్లుగా ఉంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం. వరస గెలుపులతో ఆయనలో అహం పెరిగినట్లే కన్పిస్తుంది. లాక్ డౌన్ ను కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్ల పెట్టడం విమర్శలకు తావిస్తోంది. లాక్ డౌన్ అనేక చోట్ల సక్రమంగా అమలు కావడం లేదని ఒకవైపు అంటూనే, మరో వైపు లాక్ డౌన్ తో పేదలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.

కష్ట సమయంలో ఉన్నా….

ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనదేశంలో మూడో దశకు చేరుకుంటే కరోనాను ఆపడం ఎవరి తరమూ కాదన్నది నిపుణుల అభిప్రాయం. దాదాపు ఇరవై కోట్లమంది ప్రజలు మత్యువాత పడే అవకాశముందన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశం మొత్తాన్ని ఏప్రిల్ 14 వ తేదీ వరకూ లాక్ డౌన్ ప్రకటించేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా…

ఇంకోవైపు లక్షా ఏడు వేల కోట్ల భారీ ప్యాకేజీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది పేదలు, దినసరి కూలీలకు కొంత మేలు చేకూరస్తుంది. అనేక రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయి. అయినా దేశ వ్యాప్తంగా నిత్యవసరాల కొరత తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సయితం ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధించింది.

అందరూ సమర్థిస్తున్నా….

అయితే ఇన్ని జరుగుతున్నా ప్రశాంత్ కిషోర్ మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. మోదీ తనను పొగుడుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ లోనూ బీజేపీ కూటమి విజయం సాధించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సోనియా గాంధీతో సహా అన్ని రాజకీయ పక్షాలు మోదీ చర్యలను సమర్థిస్తుండగా, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News