ఆయనకు అన్నీ చెప్పే చేయాలట

రాజ‌కీయాల‌కు కీలక రాజ‌ధానిగా ఉన్న విజ‌య‌వాడలో వైసీపీ రాజ‌కీయం ఏక వ్యక్తి కేంద్రంగా సాగుతోంది. ఒక మంత్రి, మ‌రో కీల‌క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. ఇక్కడ రాజ‌కీయంగా ఓ [more]

Update: 2019-09-08 08:00 GMT

రాజ‌కీయాల‌కు కీలక రాజ‌ధానిగా ఉన్న విజ‌య‌వాడలో వైసీపీ రాజ‌కీయం ఏక వ్యక్తి కేంద్రంగా సాగుతోంది. ఒక మంత్రి, మ‌రో కీల‌క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. ఇక్కడ రాజ‌కీయంగా ఓ పారిశ్రామిక వేత్త చ‌క్రం తిప్పుతుండ‌డంతో ఎవ‌రూ ఏమీ అనే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎవ‌రికి వారు గుంభ‌నంగా ఉంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేసిన పొట్లూరి వీర ప్రసాద్ ఉర‌ఫ్ పీవీపీ.. పోటీ చేశారు. అయితే, టీడీపీ నేత కేశినేని నానితో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌రంలో ఆయ‌న ఓడిపోయారు. కొన్ని రోజులు మౌనంగానే ఉన్నప్పటికీ.. త‌ర్వాత మాత్రం ఆయ‌న రాజ‌కీయంగా దూకుడు పెంచారు. కేశినేని నానిపై ట్వీట్లు సంధిస్తున్నారు.

కేశినేని నానిపైనే….

స‌రే! ఇది ఆయ‌న వ్యక్తిగ‌తం అనుకున్నా.. న‌గ‌రంలోని వైసీపీ నేత‌ల‌ను కూడా ఆయ‌నే నిర్దేశిస్తున్నార‌నే వ్యాఖ్యలు త‌ర‌చుగా విని పిస్తున్నాయి. పార్టీ త‌ర‌ఫున ఏమైనా గ‌ళం వినిపించాల‌ని అనుకున్నా.. పీవీపీ అనుమ‌తి త‌ప్పని స‌రి! అనే ఆదేశాలు ఉన్నాయ ని అంటున్నారు. దీంతో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ కూడా పెద్దగా స్పందించ‌డం లేదు. ఇక‌, సెంట్రల్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన మ‌ల్లాది విష్ణు గ‌తంలోనూ రాజ‌కీయంగా చురుగ్గా ఉండేవారు. అయితే, ఆయ‌న కూడా ఇప్పుడు మౌనం వ‌హిస్తున్నారు. ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, వైసీపీలోకి వ‌చ్చాక కూడా ఎమ్మెల్యేగా గెల‌వ‌న‌ప్పుడు విప‌క్షాల‌కు ఘాటుగా కౌంట‌ర్లు ఇచ్చేవారు. ఇప్పుడు విజ‌య‌వాడ టీడీపీలో బుద్ధా వెంక‌న్న, కేశినేని నాని లాంటి వాళ్లు ప్రభుత్వంపై, వైసీపీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శలు చేస్తున్నా పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేదు.

కార్పొరేషన్ ఎన్నికలపైనే….

ప్రతి చిన్న విష‌యాన్నీ పీవీపీకి చెప్పి చేయాల‌ని, ఆయ‌న అనుమ‌తి ఉంటేనే మాట్లాడాల‌ని చెబుతుండ‌డంతో ప్రతి ఒక్కరూ విప‌క్షం టీడీపీ నేత‌ల నుంచి ఎన్ని విమ‌ర్శలు వ‌స్తున్నా.. మాకెందుకులే అని త‌ప్పించుకుంటున్నారు. చేస్తే గేస్తే పీవీపీ కేశినేని నాని టార్గెట్‌గా విమ‌ర్శలు చేస్తున్నారే త‌ప్పా మిగిలిన విష‌యాల్లో ఆయ‌న విప‌క్షాల‌కు కౌంట‌ర్లు అంత గ‌ట్టిగా ఇవ్వడం లేదు. త్వర‌లోనే స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పటి వ‌ర‌కు ఉన్న టీడీపీ హ‌వాను కూల‌దోసి.. విజ‌య‌వాడ‌లో తొలిసారి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీకి ప‌ట్టం క‌ట్టించ‌డం ద్వారా త‌న స‌త్తా చాటాల‌ని పీవీపీ నిర్ణయించుకున్నట్టు స‌మాచారం.

పట్టు సాధించేందుకు…..

ఈ క్రమంలోనే ఆయ‌న ప‌ట్టు సాధించేందుకు రెడీ అవుతున్నార‌ట‌. దీంతో పార్టీ నాయ‌కుల‌కు నిత్యం ఫోన్లు చేస్తూ.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నితీరును ఆరాతీస్తున్నారు. అభివృద్ధి ప‌నుల‌కు నిధులు కావాలంటే త‌న‌కు చెప్పాల‌ని, తాను జ‌గ‌న్‌కు చెప్పి ప‌నులు చేయిస్తాన‌ని చెప్పడం ద్వారా త‌న హ‌వా చ‌లాయించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఎలాగైనా కార్పొరేష‌న్లో వైసీపీ జెండా ఎగిరేలా చేసి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తాను ఓడిన కేశినేనిపై నైతికంగా విజ‌యం సాధించాల‌న్న క‌సితో ఉన్నారు. ఈ క్రమంలోనే తూర్పులో తాను ప‌ట్టుబ‌ట్టి సీటు ఇప్పించుకున్న బొప్పన భ‌వ‌కుమార్ ఉన్నా అక్కడ కూడా త‌న వ‌ర్గం ప్రత్యేకంగా మెయింటైన్ చేస్తున్నారు. సెంట్రల్‌తో పాటు వెస్ట్‌లోనూ త‌న అనుచ‌రుల‌కు కార్పొరేట‌ర్ సీట్లు ఇప్పించుకునేందుకు పీవీపీ ఇప్పటి నుంచే పావులు క‌దుపుతున్నారు. దీంతో విజ‌య‌వాడ వైసీపీలో వ‌న్ మ్యాన్ ఆర్మీ అన్న విధంగా రాజ‌కీయం సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇలా ఎన్నాళ్లు సాగిస్తారో చూడాలి.

Tags:    

Similar News