మళ్లీ ఆమెకే.. జగన్ గ్రీన్ సిగ్నల్

ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా ఆమోదం పొందింది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఎమ్మెల్సీగా పోతుల సునీతనే తిరిగి చేయాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు [more]

Update: 2020-12-21 02:00 GMT

ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా ఆమోదం పొందింది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఎమ్మెల్సీగా పోతుల సునీతనే తిరిగి చేయాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో పోతుల సునీతకు తెలియజెప్పినట్లు తెలిసింది. పోతుల సునీత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గా ఉన్నారు. అయితే మూడు రాజధానుల అంశంపై టీడీపీ విధానాన్ని పోతుల సునీత వ్యతిరేకించారు. టీడీపీలో ఉండి జగన్ ను కలిశారు.

రాజీనామా ఆమోదం…..

అయితే ఇటీవల పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఆమోదించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోతుల సునీతను బరిలోకి దించనున్నారు. వైసీపీకి బలం ఉండటంతో ఎమ్మెల్సీగా పోతుల సునీత ఎన్నిక లాంఛనమే. అయితే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోతుల సునీత విషయంలో అభ్యంతరం చెప్పినప్పటికీ జగన్ మాత్రం ఆమెకే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.

డొక్కా మాదిరిగానే….

ఇదివరకే డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేసి వచ్చినా ఆయనకే జగన్ కేటాయించారు. అదే పద్ధతిని ఇప్పుడు జగన్ పోతుల సునీత విషయంలోనూ పాటించారంటున్నారు. పోతుల సునీత మీద తెలుగుదేశం పార్టీ అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ కు పిటీషన్ ఇచ్చింది. దీనిపై ఛైర్మన్ విచారణ కూడా ప్రారంభించారు. ఈ దశలో పోతుల సునీత రాజీనామా చేసి తిరిగి వైసీపీ తరుపున అఫియషల్ సభ్యురాలిగా ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు.

టీడీపీలో యాక్టివ్ గా ఉన్నా…..

పోతుల సునీత టీడీపీలో యాక్టివ్ గా ఉండేవారు. అందుకే ఆమెకు గతంలో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చీరాల నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అధికారంలోకి రావడంతో ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే టీడీపీ విధానాలు నచ్చక పోతుల సునీత పార్టీ మారారు. జగన్ కూడా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఆమెకే ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.

Tags:    

Similar News