ఆ ఇద్దరు మాజీ స్పీక‌ర్లకు అదే బెంగ.. కలసి రావడంలేదే?

వ్యాపారాల్లోనే కాదు.. రాజ‌కీయాల్లోనూ వార‌సుల‌కు ప్రాధాన్యం పెరిగిపోతోంది. గ‌తంలో త‌మ వ్యాపారాల‌ను అందిపుచ్చుకునే స్థాయికి త‌మ వారసులు పుంజుకోలేద‌నే బెంగ పెట్టుకున్న త‌ల్లిదండ్రులు ఉన్నారు. కానీ, నేడు [more]

Update: 2020-04-18 11:00 GMT

వ్యాపారాల్లోనే కాదు.. రాజ‌కీయాల్లోనూ వార‌సుల‌కు ప్రాధాన్యం పెరిగిపోతోంది. గ‌తంలో త‌మ వ్యాపారాల‌ను అందిపుచ్చుకునే స్థాయికి త‌మ వారసులు పుంజుకోలేద‌నే బెంగ పెట్టుకున్న త‌ల్లిదండ్రులు ఉన్నారు. కానీ, నేడు త‌మ పిల్లలు ఆశించిన రేంజ్‌లో త‌మ రాజకీయ వార‌సులుగా పుంజుకోవ‌డం లేద‌ని భావిస్తున్న, బెంగ పెట్టుకుంటున్న నేత‌లు క‌నిపిస్తున్నారు. వీరిలో ప్రముఖంగా ఇద్దరు మ‌హిళా నాయ‌కురాళ్లు క‌నిపిస్తున్నారు. వారు ఎస్సీ వ‌ర్గానికి చెందిన వారై ఉండ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో ఉమ్మడి రాష్ట్రంలో స్పీక‌ర్ గా, డిప్యూటీ స్పీక‌ర్‌గా వ్యవ‌హ‌రించిన వారు కావ‌డం మ‌రింత విశేషం. వారే మాజీ స్పీక‌ర్ ప్రతిభా భార‌తి, మాజీ డిప్యూటీ స్పీక‌ర్ గుమ్మడి కుతూహ‌ల‌మ్మ.

గత ఎన్నికలలోనే?

ఇద్దరూ కూడా టీడీపీకి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇరువురు నాయ‌కురాళ్లు కూడా విద్యావంతులు కావ‌డం, చంద్రబాబుకు అత్యంత స‌న్నిహితులు కావ‌డం కూడా విశేషం. గ‌తంలో ప్రతిభా భార‌తి చంద్రబాబు హ‌యాంలోనే ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్‌గా వ్యవ‌హ‌రించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆమె కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్రమంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో త‌న వార‌సురాలు గ్రీష్మను రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని నిర్ణయించుకున్నారు. రాజాం టికెట్‌ను ఆశించారు. అయితే అంత‌ర్గత విభేదాల కార‌ణంగా.. మ‌రోప‌క్క, కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి కొండ్రు ముర‌ళీ మోహ‌న్‌కు టికెట్ ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయారు.

స్థానిక నాయకత్వం సహకరించక…..

అప్పటి నుంచి ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటున్నారు. పైగా జ‌గ‌న్‌ను ఇటీవ‌ల కాలంలో పొగుడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌గ్గాల‌ను త‌న కుమార్తె గ్రీష్మకు అప్ప‌గించాల‌ని ప్రతిభా భార‌తి చంద్రబాబును కోరుతున్నా రు. అయినా ఎక్కడా ఆయ‌న స్పందించ‌డం లేదు. దీంతో ఆమె త‌న కుమార్తె రాజ‌కీయాల‌పై బెంగ పెట్టుకున్నార‌ని అంటున్నారు. ఇక‌, మాజీ డిప్యూటీ స్పీక‌ర్ ప్రస్తుతంటీడీపీ నాయ‌కురాలు.. గుమ్మడి కుతూహ‌ల‌మ్మ ప‌రిస్థితి మ‌రో విధంగా ఉంది. గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ప‌గ్గాల‌ను చంద్రబాబు ఆమె కుమారుడు హ‌రికృష్ణకే ఇచ్చారు. అంతేకాదు, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ఇచ్చారు. అయితే, ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. దీనికి స్థానిక నాయ‌క‌త్వం త‌మ వెంట రాలేద‌ని త‌ల్లీ కుమారుడు చెబుతున్నారు.

ఎటూ తేల్చుకోలేక…?

అయితే, ఇక్కడ టీడీపీ శ్రేణుల‌ను నాయ‌కుల‌ను త‌మ వెంట తిప్పుకునే విష‌యంలో కుతూహ‌ల‌మ్మ, ఆమె కుమారుడు హ‌రికృష్ణలుకూడా విఫ‌ల‌మ‌య్యార‌ని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఎవ‌రూ కూడా స‌హ‌క‌రించ‌డం లేదనేది వాస్తవ‌మే. దీంతో ఇప్పుడు త‌మ కుమారుడి భ‌విత‌వ్యం ఏంట‌నేది కుతూహ‌ల‌మ్మకు దిగులు ప‌ట్టుకుంది. పోనీ.. వైసీపీలోకి వెళ్దామా? అంటే.. అక్కడ పార్టీలోకి ఆహ్వానించేవారు క‌నిపించ‌డం లేదు. ఇటు సైకిల్ దిగుదామా? అంటే ఉన్న వేదిక కూడా పోతుందా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తానికి మాజీ స్పీక‌ర్‌, మాజీ డిప్యూటీ స్పీక‌ర్ వార‌సుల రాజ‌కీయం చింద‌ర వంద‌ర‌గా ఉంద‌నేది వాస్తవం.

Tags:    

Similar News