బోనాలు ఎత్తిన పోలవరం

ఎపి లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్ట్ సందర్శన కు ప్రజలను వేలాదిగా తరలిస్తూ ఉండటంతో అక్కడ జాతర మొదలైంది. ఎన్నికల తరుణం కావడంతో కేంద్రం నిర్మించి ఇవ్వలిసిన [more]

Update: 2019-02-04 03:14 GMT

ఎపి లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్ట్ సందర్శన కు ప్రజలను వేలాదిగా తరలిస్తూ ఉండటంతో అక్కడ జాతర మొదలైంది. ఎన్నికల తరుణం కావడంతో కేంద్రం నిర్మించి ఇవ్వలిసిన ప్రాజెక్ట్ క్రెడిట్ ను టిడిపి తమ ఖాతాలో జమ చేసుకోవడానికి చక్కని ప్రణాళికా బద్ధంగా పోలవరం సందర్శన ఏర్పాటు చేసింది బాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుంచి పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించడం, ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడంతో ప్రాజెక్ట్ ప్రాంతం తీర్ధం గా మారిపోయింది. దీనికోసం కోట్లాది రూపాయలు ప్రజాధనం వినియోగించడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నా ప్రచార యావతో వాటి అన్నిటిని పక్కన పెట్టింది ప్రభుత్వం. అయితే ఇంత చేస్తున్నా ఇక్కడ అవకతవకలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఘర్షణలకు దారితీస్తున్న పరిస్థితి …

పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు భారీ ఎత్తున ప్రజలను అధికారులు తరలించడం వరకు బానే వుంది. అయితే వచ్చిన పర్యాటకులకు భోజన కార్యక్రమం లో నిత్యం వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేలాదిమందికి ఒకేసారి భోజనం అందించడం ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న వారికి సాధ్యం కావడం లేదు. దాంతో వచ్చినవారు ఖాళీ ప్లేట్ లతో తోపులాటలు తొక్కిసలాటలు నిత్యకృత్యం అయిపోయాయి. ఈ భారీ జనసందోహం లో దెబ్బలాడి నాలుగు మెతుకులు తినడం ఎందుకని వేరే చోట తినడానికి ఆ ప్రాంతంలో హోటల్స్ లేకపోవడంతో ఆకలితో అలమటించే దుస్థితి ఎదురౌతుంది. దాంతో తమను పోలవరం టూర్ కి తరలించిన వారిపై ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా టూర్ జరిపించి నాలుగు ఓట్లు రాల్చుకుందామనుకున్న అధికార పార్టీకి ఈ కార్యక్రమం ఇప్పుడు కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా మారడం తమ్ముళ్లు గుర్తించారో లేదో మరి.

Tags:    

Similar News