టెక్కలి టెక్కు వదిలిస్తారట…?

టెక్కలిని తన రాజకీయ కంచుకోటగా చేసుకుని ఎవరినీ లెక్కచేయకుండా ముందుకు పోతున్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు చుక్కలు చూపించాలని వైసీపీ డిసైడ్ అయింది. అచ్చెన్న మార్క్ [more]

Update: 2020-11-23 03:30 GMT

టెక్కలిని తన రాజకీయ కంచుకోటగా చేసుకుని ఎవరినీ లెక్కచేయకుండా ముందుకు పోతున్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు చుక్కలు చూపించాలని వైసీపీ డిసైడ్ అయింది. అచ్చెన్న మార్క్ పాలిటిక్స్ ఇక చెల్లదని టెక్కలి వైసీపీ ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ ఓ వైపు గట్టిగానే గర్జిస్తునే ఉన్నారు. ఆ పక్కనే ఉన్న పలాసా నుంచి మత్స్యకార వర్గానికి చెందిన సీదరి అప్పలరాజు ఫస్ట్ టైం లోనే మంత్రి అయిపోయి అచ్చెన్నాయుడినే టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికి 2024లో ఎన్నికలు జరుగుతాయనుకుంటే ఇప్పటి నుంచే టెక్కలిలో పొలిటికల్ హీట్ పెంచడంలో వైసీపీ బాగా ముందుంది.

పలాసా జిల్లాగా…?

కొత్త జిల్లాల వ్యవహారంతో అచ్చెన్నాయుడు కధను క్లైమాక్స్ కి తేవాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. టెక్కలి పక్కనే ఉన్న పలాసను కొత్త జిల్లాగా చేస్తారని అంటున్నారు. టెక్కలిని జిల్లా కేంద్రం చేయమని తమ్ముళ్ళు మరో వైపు అంటున్నారు. అయితే తమ ఎమ్మెల్యే లేని చోట, అదీ అచ్చెన్నాయుడు లాంటి వారు ఉన్న చోట కోరి మరీ జిల్లాను చేయడానికి వైసీపీ నేతలు ఎమీ అమాయకులు కాదు కదా. అందుకే పలాసను కొత్త జిల్లాగా ప్రకటిస్తారని అంటున్నారు. దానిలో టెక్కలిని చేర్చి అక్కడ మొత్తం రాజకీయాన్నే తమకు అనుకూలం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది.

ప్రగతికి మారుగా…

పలాను జిల్లాగా చేస్తే అక్కడ జీడిపిక్కల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అదే విధంగా కాశీబుగ్గ కూడా మరో పట్టణంగా ప్రగతి బాటన సాగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే భావనపాడు పోర్టు నిర్మాణం కూడా ఇక్కడ జరుగుతోంది. అది కనుక పూర్తి అయితే పలాసా రూపురేఖలు ఒక్కసారిగా మారిపోతాయని అంటున్నారు. ఇక ఉద్దానం కొబ్బరి రైతులు కూడా ఇక్కడే ఉన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో వారికి కూడా లాభసాటిగా ఉంటుందని, ఈ ప్రాంతం నుంచి వలసలు కూడా ఆగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక టెక్కలి కూడా పలాసా పరిధిలోకి వస్తుంది కాబట్టి జిల్లా కేంద్రంగా ఇక్కడ నుంచే రాజకీయ చక్రం తిప్పవచ్చునని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

మూడు ముక్కలుగా ….

శ్రీకాకుళం జిల్లాకు పలాస 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో అభివృద్ధి అంతా జిల్లా కేంద్రానికి పరిమితం అయిందని అంటున్నారు. ఈ క్రమంలో పలాసను రెండవ జిల్లాగా ప్రకటించడానికి వైసీపీ సర్కార్ రెడీగా ఉందని తెలుస్తోంది. అదే సమయంలో ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలో అలాగే ఉంచుతారని, పాలకొండ సహా గిరిజన ప్రాంతాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్వతీపురం గిరిజన జిల్లాలో విలీనం చేస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే సిక్కోలుని మూడు ముక్కలు చేయడం ద్వారా జిల్లా రాజకీయాన్ని కూడా ఒడిసిపట్టాలని వైసీపీ చూస్తోంది.

Tags:    

Similar News