పితాని పట్టు తగ్గిందా?

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ ఫ్యూచ‌ర్ ఏంటి? ఆయ‌న ఇప్పుడు ఏం చేస్తున్నారు ? అనే విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర [more]

Update: 2020-02-08 03:30 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ ఫ్యూచ‌ర్ ఏంటి? ఆయ‌న ఇప్పుడు ఏం చేస్తున్నారు ? అనే విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో కాంగ్రెస్ హ‌యాంలోను, త‌ర్వాత ఇటీవ‌ల ముగిసిన టీడీపీ హ‌యాంలోనూ పితాని సత్యనారాయణ మంత్రిగా ప‌నిచేశారు. గ‌తేడాది ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు 15 ఏళ్లు ఎమ్మెల్యేగాను, 8 యేళ్లు మంత్రిగాను ఆయ‌న జిల్లా రాజ‌కీయాల‌తో పాటు రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు. శెట్టిబ‌లిజ క‌మ్యూనిటీ అండ‌తో రాజకీయం చేసే నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న పితాని సత్యనారాయణ గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2004లో పెనుగొండ నుంచి గెలిచిన పితాని, 2009లో ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్ తో ఆయ‌న పార్టీ మారి టీడీపీ టికెట్‌పై 2014లోనూ విజ‌యం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.

పార్టీకి దూరంగా….

ఇక‌, 2017లో మంత్రి వ‌ర్గ విస్తర‌ణ స‌మ‌యంలో చంద్రబాబు పితాని సత్యనారాయణకి కేబినెట్లో బెర్త్‌ను కేటాయించారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి వెళ్లాల‌ని ప్రయ‌త్నించిన పితాని సత్యనారాయణ మ‌ళ్లీ టీడీపీలోనే ఉండిపోయారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో పితాని ఓట‌మిపాల‌య్యారు. ఇక‌, అప్పటి నుంచి కూడా పెద్దగా రాజ‌కీయాల్లో ఊపు చూపించ‌లేక పోతున్నారు. ప్రస్తుతం టీడీపీ అనేక ఉద్యమాలు చేప‌డుతోంది. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజ‌ల‌కు చేరువ కావాల‌ని భావిస్తోంది. ఈ త‌రుణంలో పార్టీకి అండ‌గా ఉండాల్సిన పితాని సత్యనారాయణ ఇప్పుడు మౌనం వ‌హించ‌డం ఆశ్చర్యంగా ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

అంటీ ముట్టనట్లుగా…..

జిల్లాకు చంద్రబాబు వ‌చ్చినా కూడా పితాని అంటీ ముట్టన‌ట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పితాని సత్యనారాయణ ప‌ట్టు త‌గ్గింది. ఒక‌ప్పుడు ఆయ‌న కుల రాజ‌కీయాలు న‌మ్ముకున్నా.. మారిన ప‌రిస్థితుల్లో ఇప్పుడు కులం అంతా ఆయ‌న వెంట న‌డిచే ప‌రిస్థితి లేదు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆయ‌న‌కు వ్యతిరేకంగా కుల రాజ‌కీయం న‌డుస్తోంది. ప్రస్తుత సంక‌ట ప‌రిస్థితుల్లో ఇప్పుడు కూడా పితాని సత్యనారాయణ పార్టీ మారేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. అవ‌కాశం ఉంటే అధికార పార్టీలో చేరాల‌ని ఆయ‌న యోచిస్తున్నారు. నిజ‌మే నిన్న మొన్నటి వ‌ర‌కు వైసీపీకి కూడా కొత్త నేత‌ల అవస‌రం ఎంతో ఉంది. పైగా టీడీపీ నుంచి వ‌స్తానంటే ఎవ‌రు వ‌ద్దంటారు? అనే ప్రశ్న కూడా ఎదుర‌య్యేది. అలాంటిది ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి దారుణంగా ఉంది. పార్టీ మారే వారు అక్కడ ఏదో ఒక ప‌ద‌వి రాక‌పోదా ? అన్న ఆశ‌తో పార్టీ మారేవారు.

సీన్ రివర్స్ కావడంతో….

అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. మండ‌లిని ర‌ద్దు చేయ‌డంతో వైసీపీ నేత‌ల‌కే ఫ్యూచ‌ర్‌పై భ‌రోసాలేకుండా పోయింది. ఆ పార్టీలో ఉన్నవారికే ప‌ద‌వులు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రో ఎక్కడి నుంచో వ‌స్తామంటే ఇక్కడ రీప్లేస్ చేసి, ప‌ద‌వులు ఇచ్చే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో పితానికి టీడీపీలో ఉండ‌లేని, బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్పడింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News