Peethala : పీతలను అడ్డుకుంటుంది ఆయనేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్ని నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమిస్తున్నారు. ముఖ్యంగా రిజర్వ్ డ్ నియోజకవర్గాలకు దాదాపుగా ఇన్ ఛార్జులను నియమించే ప్రక్రియ పూర్తయింది. కానీ [more]

Update: 2021-10-19 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్ని నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమిస్తున్నారు. ముఖ్యంగా రిజర్వ్ డ్ నియోజకవర్గాలకు దాదాపుగా ఇన్ ఛార్జులను నియమించే ప్రక్రియ పూర్తయింది. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గానికి చంద్రబాబు ఇంతవరకూ ఇన్ ఛార్జిని నియమించకపోవడంపై చర్చ జరుగుతుంది. ఇక్కడ పీతల సుజాతను ఇన్ ఛార్జిగా నియమిస్తారని భావించినా ఇంతవరకూ నియామకం జరగలేదు.

ఇన్ ఛార్జి పదవి కోసం….

పీతల సుజాత పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే అవినీతి ఆరోపణల కారణంగా పీతల సుజాతను మంత్రి పదవి నుంచి తప్పించారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఆమెకు చింతలపూడి టిక్కెట్ కూడా దక్కలేదు. కర్రి రాజారావుకు ఇచ్చారు. ఆయన ఓటమి చెందారు. ఇక రాజారావు మరణించారు. అయితే చింతలపూడి పార్టీ ఇన్ ఛార్జి పదవిని మాత్రం పీతల సుజాతకు ఇవ్వలేదు.

కొత్తేమీ కాకపోయినా….

పీతల సుజాతకు ఇదేమీ కొత్త కాదు. 2004లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. 2009లో ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. తిరిగి 2014లో ఇచ్చారు. 2019లో చంద్రబాబు ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించారు. పీతల సుజాత ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. మాగంటి బాబుకు ఆమెకు వర్గ విభేదాలున్నాయి. ప్రస్తుతం మాగంటి బాబు మౌనంగానే ఉంటున్నారు. రాజకీయాలను పట్టించుకోవడం లేదు.

ఆయనే అడ్డు అట….

అయితే పీతల సుజాతకు చింతమనేని ప్రభాకర్ ఇన్ ఛార్జి పదవిని ఇచ్చేందుకు అడ్డుపడుతున్నారని తెలిసింది. ఈ నియోజకవర్గంలో ఆయనకు కూడా వర్గాలున్నాయి. ఎస్సీ నియోజకకవర్గం కావడంతో అగ్రకులాల ఆధిపత్యం నడుస్తుంది. పీతల సుజాత పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా ఇన్ ఛార్జి పదవిని ఇచ్చేందుకు మాత్రం చంద్రబాబు సుముఖంగా లేరు. అయితే ఇక్కడ త్వరగా ఇన్ ఛార్జిని నియమించాలని పార్టీ క్యాడర్ డిమాండ్ చేస్తుంది.

Tags:    

Similar News