అక్కడ బాధ్యత మ‌ళ్లీ పీత‌ల‌కేనా… క‌లిసొస్తోన్న కాలం

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు మాజీ మంత్రి పీత‌ల సుజాత‌. 2014 ఎన్నిక‌ల చివ‌రి క్షణంలో చింత‌ల‌పూడి సీటు ద‌క్కించుకుని గెలిచిన పీత‌ల సుజాత‌ [more]

Update: 2021-01-19 00:30 GMT

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు మాజీ మంత్రి పీత‌ల సుజాత‌. 2014 ఎన్నిక‌ల చివ‌రి క్షణంలో చింత‌ల‌పూడి సీటు ద‌క్కించుకుని గెలిచిన పీత‌ల సుజాత‌ వెంట‌నే మంత్రి అయ్యారు. మంత్రిగా మూడేళ్ల పాటు ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో వ‌ర్గం ( క‌మ్మ వ‌ర్గంతో పాటు అప్పటి ఏలూరు ఎంపీ మాగంటి వ‌ర్గం) సుజాతను ఏ మాత్రం ప్రశాంతంగా ఉండ‌నీయ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాలు ప్రోత్సహిస్తూ పీత‌ల సుజాత‌ను పూర్తిగా డిస్టర్బ్ చేశారు. వీళ్లకు చింత‌మ‌నేని ఎంక‌రేజ్‌మెంట్ కూడా ఉండ‌డంతో సుజాత మంత్రి ప‌ద‌వి మూడేళ్లకే ముగిసింది. ఆ త‌ర్వాత రెండేళ్లు ఎమ్మెల్యేగా మాత్రం ఆమె స్పీడ‌ప్ అయ్యి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న కేడ‌ర్‌ను కాపాడుకున్నారు.

గ్రూపు రాజకీయాలతో….

పీత‌ల సుజాత‌ ఎంత క‌ష్టప‌డినా గ్రూపు రాజ‌కీయాల‌ను మాత్రం ఆమె దాట‌లేక‌పోయారు. చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో చంద్రబాబు అప్పటి సుజాత వ్యతిరేక వ‌ర్గానికి త‌లొగ్గి ఆమెను ప‌క్కన పెట్టి క‌ర్రా రాజారావుకు సీటు ఇచ్చారు. ఎన్నిక‌ల్లో క‌ర్రా 36 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడారు. ఎన్నిక‌ల‌కు ముందే అవుట్ డేటెడ్ లీడ‌ర్ అయిపోయిన క‌ర్రా ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత సైలెంట్ అవ్వడంతో పాటు పార్టీని ప‌టిష్టం చేసే చ‌ర్యలు కూడా తీసుకోలేదు. ఇక ఇటీవ‌ల క‌ర్రా అనారోగ్యానికి హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. వ‌యోః భారంతో పాటు అనారోగ్య స‌మ‌స్యలు ఉండ‌డంతో తిరిగి ఆయ‌న రాజ‌కీయంగా యాక్టివ్ అయ్యే ప‌రిస్థితి లేదు.

బలమైన నాయకత్వం లేక…..

ప్రస్తుతం చింత‌ల‌పూడి టీడీపీలో కేడ‌ర్ ఉన్నా వీరిని ఏక‌తాటిమీద‌కు తీసుకు వ‌చ్చి ముందుకు న‌డిపించే బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేదు. నియోజ‌క వ‌ర్గ పార్టీలో కీల‌క నేత‌లు లేని దీనావ‌స్థలో పార్టీ ఉంది. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఎస్సీ నేత‌ల‌కే బాధ్యత‌లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత ఇన్‌చార్జ్ రాజారావు మ‌ళ్లీ క్రియాశీల‌కంగా యాక్టివ్ అయ్యే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ పీత‌ల సుజాత‌తో పాటు ఆమె వ‌ర్గం నేత‌లు యాక్టివ్ అవుతున్నారు.

సుజాత‌కే ఛాన్స్ ..?

గ‌త ఎన్నిక‌ల్లో సీటు రాక‌పోయినా పీత‌ల సుజాత‌ మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కేడ‌ర్‌కు అందుబాటులో ఉంటూ వీలున్నప్పుడ‌ల్లా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటిస్తున్నారు. పార్టీ నేత‌ల కార్యక్రమాలు, ప‌రామ‌ర్శల‌కు హాజ‌ర‌వుతున్నారు. క‌రోనా స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నేత‌ల‌ను ఎవ్వరూ ప‌ట్టించుకోక‌పోయినా సుజాతే ఆదుకున్నారు. ప్రస్తుతం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో ఏర్పడిన రాజ‌కీయ శూన్యత‌ను భ‌ర్తీ చేసేందుకు పీత‌ల సుజాత‌ అయితేనే క‌రెక్ట్ అని పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

నాడు అధికారం వెల‌గ‌బెట్టినోళ్లు?

పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు నాటి ఎంపీ మాగంటి బాబు, నాటి జ‌డ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, అప్పటి విప్ చింత‌మ‌నేని ప్రభాక‌ర్ అండ చూసుకుని రెచ్చిపోయిన నేత‌లు, కాంట్రాక్టులు చేసి ల‌బ్ధిపొందిన వారు ఇప్పుడు పూర్తి సైలెంట్ అయిపోయారు. పార్టీ ఇంత ఇబ్బందుల్లో ఉంటే పార్టీని ప‌ట్టించుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావ‌డం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నేత‌ల‌కు పెత్తనాలు, కాంట్రాక్టులు, షోయింగ్‌లు కావాలే త‌ప్పా.. పార్టీ క‌ష్టాల్లో ఉంటే ముందుకు రారు అన్నట్టుగా ఈ నేత‌ల ప‌రిస్థితి ఉంది.

మళ్లీ లైన్ క్లియర్…..

పార్టీ కోసం ముందు నుంచి క‌ష్ట‌ప‌డిన వారు, పీత‌ల సుజాత‌ వ‌ర్గం నేత‌లు మాత్రం పార్టీ ఓడిపోయినా ఇప్పటికీ పార్టీని త‌మ భుజ‌స్కంధాల‌పైనే పార్టీని మోస్తున్నారు. ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల పంపిణీలో సుజాత త‌న‌కు ప్రయార్టీ లేద‌ని ముందుగా చిన్నబుచ్చుకున్నట్టు వార్తలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఆమె యాక్టివ్ అవ్వ‌డంతో పాటు ప్రెస్‌మీట్లతో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై విమ‌ర్శలు చేసిన మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌ను ఓ ఆటాడుకున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లోలా చంద్రబాబు ఒత్తిళ్లకు త‌లొగ్గి టిక్కెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో పీత‌ల సుజాత‌కు చింత‌ల‌పూడిలో మ‌ళ్లీ లైన్ క్లీయ‌ర్ అవుతోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Tags:    

Similar News