మ‌ళ్లీ పీత‌లే గ‌త‌య్యేలా ఉందే….?

చంద్రబాబు నాయుడు చాలా భ‌య‌స్తుడు అన్న టాక్ ఆ పార్టీ వ‌ర్గాల్లో ఉంది.. ఎవ‌రు అయినా ఓ నేత బెదిరిస్తే అప్పట్లో వైఎస్..ఇప్పుడు జ‌గ‌న్ అయినా బ‌య‌ట‌కు [more]

Update: 2020-08-05 00:30 GMT

చంద్రబాబు నాయుడు చాలా భ‌య‌స్తుడు అన్న టాక్ ఆ పార్టీ వ‌ర్గాల్లో ఉంది.. ఎవ‌రు అయినా ఓ నేత బెదిరిస్తే అప్పట్లో వైఎస్..ఇప్పుడు జ‌గ‌న్ అయినా బ‌య‌ట‌కు పొమ్మని ఒకే ఒక మాట ఖ‌రాఖండీగా చెప్పేస్తారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఎంతోమంది నేత‌ల‌ను ప‌క్కన పెడితే వాళ్లు బెదిరించినా చాలా లైట్ తీస్కొన్నాడు. అదే చంద్రబాబు సీట్ల విష‌యంలో ఓ మోస్తరు సీనియ‌ర్ బెదిరించినా త‌ల‌వంచేసి వాళ్లు చెప్పింది చేసేస్తారు. ఇది పార్టీ వాళ్లే చెప్పే మాట‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీట్ల పంపిణీ విష‌యంలో బాబు తీవ్ర అన్యాయం చేసిన మ‌హిళా నేత మాజీ మంత్రి పీత‌ల సుజాత‌. నిజానికి పీతల సుజాత 2014 ఎన్నిక‌ల్లో గెలిచి మంత్రి అయిన‌ప్పటి నుంచి అప్పటి ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింత‌మ‌నేని వ‌ర్గాలు ఆమెను ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేశాయి. ఆమె రాష్ట్రానికి మంత్రిగా ఉన్నా కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెట్టి.. గ్రూపు రాజ‌కీయాలు ఎంక‌రేజ్ చేసి ఆమెను ఎన్నో అవ‌మానాల‌కు గురి చేశారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో ఆమెకు సీటు రాకుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. చంద్రబాబు సైతం పార్టీ కోసం ఎంతో క‌మిట్‌మెంట్‌తో ఉన్న పీతల సుజాతను కాద‌ని… త‌న వ‌ర్గం మాట‌ల‌కు విలువ ఇస్తూ జ‌నాలు మ‌ర్చిపోయిన అవుట్ డేటెడ్ లీడ‌ర్ క‌ర్రా రాజారావుకు సీటు ఇచ్చారు.

నమ్మించి మోసం చేసిన…..

ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడిలో టీడీపీ చ‌రిత్రలోనే లేనంత ఘోరంగా ఏకంగా 36 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. అంటే పీతల సుజాత 2014 గెలిచిన 16 వేల మెజార్టీకి ఇది డ‌బుల్ కంటే అద‌నం. పార్టీని క‌రెక్ట్ టైంలో న‌మ్మించి మోసం చేసి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లొచ్చిన రాజారావుపై ప్రజ‌ల్లో కాదు పార్టీ వ‌ర్గాల్లోనే ఏ మాత్రం స‌దభిప్రాయం లేదు. అటు సుజాత‌ను ఐదేళ్ల పాటు ముప్పుతిప్పులు పెట్టిన ఎంపీ మాగంటి ఘోరంగా 1.65 ల‌క్షల ఓట్ల తేడాతో ఓడితే.. త‌న జీవితంలో ఓట‌మి అనేది ఎర‌గ‌న‌ని ఎన్నో క‌థ‌లు చెప్పిన ప్రభాక‌ర్ 17 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. త‌ర్వాత మాగంటి రాజ‌కీయాల‌కు దూరం దూరంగా ఉంటున్నారు. పార్టీ ఓడిపోయాక అదే మాగంటి, ప్రభాక‌ర్ అస‌లు చింత‌ల‌పూడి వైపే క‌న్నెత్తి చూడ‌లేదు. ఇక ఇక్కడ ఓడిన క‌ర్రా రాజారావు ఇప్పటికే వ‌యోః భారంతో ఇబ్బంది ప‌డుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చింత‌ల‌పూడి విష‌యంలో మ‌ళ్లీ పీత‌ల సుజాత పేరునే ఆయ‌న ఆలోచిస్తున్నట్టు టీడీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి.

పార్టీని బలోపేతం చేస్తూ…..

ఇక ఎన్నిక‌ల్లో సీటు రాక‌పోయినా పీతల సుజాత మాత్రం జిల్లా అంత‌టా పార్టీ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ ప‌ట్ల అదే క‌మిట్‌మెంట్‌తో ఉన్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు ఉన్న బ‌ల‌మైన వ‌ర్గం ఆమెకే ప‌గ్గాలు అప్పగించాల‌ని కోరుతోంది. విచిత్రం ఏంటంటే మొన్న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి చాలా త‌క్కువ గ్రామాల్లో మాత్రమే మెజార్టీ వ‌స్తే అవ‌న్నీ సుజాత అనుచ‌రుల గ్రామాలే కావ‌డం విశేషం. ఇక సుజాత‌కు మంచి ప‌ట్టున్న, ఆమె అనుచ‌ర‌గ‌ణం ఉన్న నియోజ‌క‌వ‌ర్గానికి గుండెకాయ లాంటి జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలో ఏకంగా 14 వార్డుల్లో టీడీపీకి ఆధిక్యం వ‌చ్చింది. ఇక క‌రోనాకు ముందు వ‌ర‌కు సుజాత నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పార్టీ కార్యక‌ర్త పిలిచినా వివాహాల నుంచి ఇత‌ర కార్యక్రమాలకు హాజ‌ర‌వుతూ వ‌చ్చారు. కరోనా వేళ నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా వారియిర్స్‌గా ఉన్న పోలీసులు, ఆఫీస‌ర్లకు మునిసిపాలిటీ సిబ్బంది, ఏఎన్ఎంలు ఇత‌ర సిబ్బంది క‌రోనా కిట్లు, శానిటైజ‌ర్ల నుంచి ఎంతో సాయం చేశారు. ఇక ఇబ్బందుల్లో ఉన్న పార్టీ కార్యక‌ర్తలకు వ్యక్తిగ‌త సాయం చేశారు.

అదే పీతలకు ప్లస్……

ఇక పీతల సుజాతకు సీటు ఇవ్వొద్దని వ్యతిరేకించిన మాగంటి బాబు కుటుంబ రాజ‌కీయ భ‌విష్యత్తే అగ‌మ్య గోచ‌రంగా మార‌డంతో మాగంటి చంద్రబాబు మాట‌ను కాద‌నే ప‌రిస్థితి లేదు. పీతల సుజాతను వ్యతిరేకించే ప‌రిస్థితి లేదు. ఇక చింత‌మ‌నేని పూర్తిగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే సైలెంట్ అయ్యే ప‌రిస్థితి. ఇక పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న క‌ర్రా రాజారావును ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. పార్టీ ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నా చింత‌ల‌పూడి మండ‌లంలో ఒక‌రిద్దరు పార్టీ మార‌డం మిన‌హా ఆమె కేడ‌ర్ చెక్కు చెద‌ర్లేదు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు మాకు పీతల సుజాత వ‌ద్దని హంగామా చేసిన అప్పటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ( కొంద‌రు) ఇప్పుడు ఆమె అయితేనే క‌రెక్ట్ అని చ‌ర్చించుకోవ‌డం కొస‌మెరుపు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే పార్టీ క‌ష్టకాలంలో ఉండి ప్రస్తుతం జ‌రుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో అదే మాగంటి గ్రూపు సైలెంట్‌గా త‌ప్పుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తోన్న చంద్రబాబు మళ్లీ చింత‌ల‌పూడి ప‌గ్గాలు పీత‌ల‌కు ఇచ్చేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఏదేమైనా పార్టీ, చంద్రబాబు ప‌ట్ల క‌మిట్‌మెంట్‌తో ఉండ‌డ‌మే పీత‌ల‌కు ఈ రోజు ప్లస్ అయ్యింద‌నే చెప్పాలి.

Tags:    

Similar News