గుడ్ లుక్స్ లో ఉన్నారట.. పిన్నెల్లి రేసులో ముందున్నారు

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హీరో అయ్యారు. తన నియోజకవర్గంలో అన్నీ ఏకగ్రీవాలు చేసుకుని పార్టీలోనే పెద్ద ఇమేజ్ ను తెచ్చుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో [more]

Update: 2020-03-24 15:30 GMT

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హీరో అయ్యారు. తన నియోజకవర్గంలో అన్నీ ఏకగ్రీవాలు చేసుకుని పార్టీలోనే పెద్ద ఇమేజ్ ను తెచ్చుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోనే హైలెట్ అయింది. వివాదాలు కూడా అక్కడే చోటు చేసుకున్నాయి.

మాచర్ల హాట్ టాపిక్…..

మాచర్లలో నామినేషన్లను కూడా వేయనీయకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని టీడీపీ ఆరోపించింది. పోలీసులు కూడా నామినేషన్లను వేయడంలేదని ఫిర్యాదు చేసింది. అంతేకాదు మాచర్ల వెళ్లిన టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులపై దాడి ఎఫెక్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అయినా సరే మాచర్లలో అన్ని స్థానాలను తన వశం చేసుకోవడంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సక్సెస్ కాగలిగారు.

జగన్ వెంటే ఉండి…..

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ గుడ్ లుక్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పిన్నెల్లి టార్గెట్ కూడా అదే. మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగుసార్లు వరసగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి జగన్ వెంట నడుస్తున్నారు. నాలుగు సార్లు వరసగా గెలవడం, సీనియర్ కావడంతో ఆయనకు ఖచ్చితంగా తొలి దఫాలోనే మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

మంత్రివర్గంలో చేరేందుకు…..

తాజాగా గుంటూరుకు చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో జిల్లాలో ఒక పోస్టు ఖాళీ కానుంది. అందులో తనకు అవకాశం దక్కాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. తన సోదరుడు వెంకటరమణారెడ్డి సాయంతో ఏకగ్రీవంగా అన్ని స్థానాలను గెలిపించుకున్న పిన్నెల్లికి మరి జగన్ ఎలాంటి గిఫ్ట్్ ఇస్తారనేది చూడాల్సి ఉంది. జగన్ గుడ్ లుక్స్ లో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారన్నది పార్టీ సీనియర్ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.

Tags:    

Similar News