ఎన్నికల వేళ పినరయికి పీకులాట?

వచ్చే ఏడాది కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ దశలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ విపక్షాల చేతికి చిక్కేసినట్లే కనపడుతుంది. కేరళలో [more]

Update: 2020-07-10 18:29 GMT

వచ్చే ఏడాది కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ దశలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ విపక్షాల చేతికి చిక్కేసినట్లే కనపడుతుంది. కేరళలో ఎన్నికలకు పినరయి విజయన్ సిద్ధమయ్యారు. ఆయన గత హయాంలో చిన్న అవినీతి మచ్చను కూడా తెచ్చుకోలేదు. ఇక విపత్కర పరిస్థితులను కూడా బాగా డీల్ చేశారన్న పేరు పినరయి విజయన్ కు ఉంది.

అధికారి మార్పిడితో…..

కేరళలో ఒకసారి ఎల్డీఎఫ్, ఒకసారి యూడీఎఫ్ అధికార పగ్గాలు చేపట్టడం సంప్రదాయంగా వస్తుంది. సంప్రదాయంగా చూసుకుంటే పినరయి విజయన్ కు మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం కష్టమే. కానీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పైన కేరళ ప్రజలకు అపార నమ్మకం ఏర్పడింది. భారీ వరదలతో అపార నష్టం, కరోనా విజృంభించినా సరైన రీతిలో స్పందించడం, మిగిలిన రాష్ట్రాల కంటే కరోనా కట్టడిలో ముందుండంతో పినరయి విజయన్ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగింది.

ఎన్నికల సమయంలో…..

అయితే ఇది నిన్నటి వరకూ విన్పించిన మాట. తాజాగా పినరయి విజయన్ రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారు. కేరళ గోల్డ్ స్కామ్ కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. గోల్డ్ స్కామ్ ప్రధాన సూత్రధారి స్వప్న సురేష్ సీఎంవోలో ఉండటంతో పినరయి విజయన్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ స్కామ్ బయటకు వచ్చిన వెంటనే ఐఏఎస్ అధికారి, సీఎం ముఖ్య కార్యదర్శి శివశంకర్ ను పినరయి విజయన్ సస్పెండ్ చేశారు. కానీ విపక్షాలు మాత్రం పినరయి విజయన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

ఎన్ఐఏ దర్యాప్తునకు….

ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పినరయి విజయన్ పై సీబీఐ విచారణ జరపాలని తొలుత డిమాండ్ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొలుత ఈ గోల్డ్ స్కామ్ కేసును సీబీఐకి అప్పగించింది. తర్వాత విదేశీ వ్యవహారాలు ఎక్కువగా ఉండటంతో ఎన్ఐఏకు అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసు కేరళ వ్యాప్తంగా సంచలనం కల్గిస్తుంది. ఎయిర్ పోర్టులో దొరికిన 30 కిలోల బంగారంపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. మరోవైపు పినరయి విజయన్ దీనిపై నిష్పక్షతంగా, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపించాలని ప్రధానికి లేఖ రాయడం విశేషం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పినరయి విజయన్ విజయానికి గోల్డ్ స్కాం కేసు అడ్డుపడేలానే కన్పిస్తుంది.

Tags:    

Similar News