విజయన్ కు విజయం దూరమయిందా?

వచ్చే ఏడాది కేరళ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కేరళ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలగించనున్నాయి. వామపక్షాలు బలంగా ఉన్న ఏకైక రాష్ట్రంగా ఉన్న కేరళలో ఈసారి ఎవరు [more]

Update: 2020-12-02 18:29 GMT

వచ్చే ఏడాది కేరళ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కేరళ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలగించనున్నాయి. వామపక్షాలు బలంగా ఉన్న ఏకైక రాష్ట్రంగా ఉన్న కేరళలో ఈసారి ఎవరు విజేత అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. పినరయి విజయన్ నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలకు కూడా వెళ్లనున్నారు. అయితే సంప్రదాయం ప్రకారం ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ మరోసారి గెలిచే అవకాశం లేదు. అయితే పినరయి విజయన్ ఈ సంప్రదాయాన్ని తిరగరాస్తారన్న ధీమా ఆ కూటమిలో వ్యక్తమవుతోంది.

మార్చి..మార్చి అధికారంలోకి…..

కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు మార్చి మార్చి అధికారంలోకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటమి 91 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 57 స్థానాలను యూడీఎఫ్ కూటమి గెలుచుకుంది. యూడీఎఫ్ కు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తుంది. ఇక్కడ బీజేపీ దూసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఏ ఒక్క స్థానంలో గెలవకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో కనీస పెరఫార్మెన్స్ చూపాలని చూస్తుంది.

గ్రూపు విభేధాలు….

కాకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై గోల్డ్ స్కామ్ ఆరోపణలు విన్పించాయి. ఆయన ప్రమేయం నేరుగా లేకపోయినా విజయన్ సహకారం ఈ స్కాంలో ఉందని విమర్శలు విన్పిస్తున్నాయి. ఐదేళ్ల పాటు పినరయి విజయన్ మచ్చ లేని నేతగా ఉన్నారు. కరోనాను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వరదల సమయంలోనూ ఏ మాత్రం వెరవకుండా ప్రజల పక్షాన నిలిచారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా పినరయి విజయన్ కేరళను అగ్రపథంలో నడుపారన్నది వాస్తవం.

ఊపు మీద కాంగ్రెస్…..

కానీ సీపీఎంలోనూ వర్గ పోరు ఎక్కువగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి అచ్చుతానందన్, ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ ల గ్రూపులుగా విడిపోయి పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ కూటమి ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో 20 స్థానాలకు 19 స్థానాలను సాధించి మంచి ఊపు మీద ఉంది. మరి పినరయి విజయన్ కాంగ్రెస్ కూటమి నుంచి పార్టీని విజయపథం వైపు ఎలా నడుపుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News