పార్టీ ఛేంజ్ అయితే… రిజల్ట్ ఒక్కటే.. ఇదే ఎగ్జాంపుల్

పార్టీ మారితే ప్రజలు ఆదరించరని మరోసారి స్పష్టమయింది. చంద్రబాబు, జగన్ ఎవరున్నా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పార్టీ మారితే మాత్రం ఆ ప్రాంత ప్రజలు అంగీకరించడంలేదు. గతంలో [more]

Update: 2021-04-01 03:30 GMT

పార్టీ మారితే ప్రజలు ఆదరించరని మరోసారి స్పష్టమయింది. చంద్రబాబు, జగన్ ఎవరున్నా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పార్టీ మారితే మాత్రం ఆ ప్రాంత ప్రజలు అంగీకరించడంలేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నా తిరిగి శాసనసభలోకి ఒక్క గొట్టి పాటి రవికుమార్ మాత్రమే అడుగుపెట్టగలిగారు. అదీ ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతోనే అది సాధ్యమయింది. చంద్రబాబు పార్టీ అధికారం నుంచి దిగిపోయింది. జగన్ గద్దెనెక్కాడు.

నలుగురు జగన్ మద్దతుదారులుగా….

జగన్ అధికారంలోకి రాగానే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను తన వద్దకు రప్పించుకోగలిగారు. అయితే చంద్రబాబు మాదిరి నేరుగా పార్టీ కండువా కప్పకుండానే మద్దతుదారులగానే వారిని ఉంచారు. శాసనసభలో ఈ నలుగురికి ప్రత్యేక స్థానాలు కేటాయించారు. జగన్ మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ లు జగన్ మద్దతుదారులుగా ఉన్నారు. జగన్ పై వీరు నిత్యం ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.

గుంటూరు పశ్చిమలో…..

కానీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరి బలమేంటో తెలిసిపోయింది. పార్టీ గుర్తు మాత్రమే తమను గెలిపిించిందని విస్మరించిన వీరికి మున్సిపల్ ఎన్నికల్లో సినిమా చూపించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి జగన్ పంచన చేరారు. అయితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో అతి తక్కువ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. గుంటూరు కార్పొరేషన్ వైసీపీ పరమయినా పశ్చి మ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఇబ్బంది పడింది. దీనికి కారణం ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నది చెప్పనవసరం లేదు. పార్టీ మారినందునే ప్రజలు అంగీకరించలేదు.

విశాఖ దక్షిణంలో…

ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ జగన్ హవాలోనూ గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వాసుపల్లి ఇది తన బలం అని భ్రమించారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం దెబ్బేసింది. కేవలం ఐదు డివిజన్లలోనే వైసీపీ ఇక్కడ గెలవడం విశేషం. పార్టీ మారిన వారిని ప్రజలు పక్కన పెడతారనడానికి వీరిద్దరే పెద్ద ఉదాహరణ. అది జగన్ అయినా.. చంద్రబాబు అయినా ఫలితం మాత్రం పార్టీ మారిన వారిపట్ల ఒక్కలాగానే ఉంటుంది.

Tags:    

Similar News