ఈసారి గట్టిగా దెబ్బ కొడతారుట… ?

అవును ఒకసారి కొడితే బిగ్ సౌండ్ వచ్చింది కానీ నో యూజ్ అన్నట్లుగానే సీన్ ఉందిట. అదే వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ లో ఫ్యాన్ పార్టీ [more]

Update: 2021-06-12 11:00 GMT

అవును ఒకసారి కొడితే బిగ్ సౌండ్ వచ్చింది కానీ నో యూజ్ అన్నట్లుగానే సీన్ ఉందిట. అదే వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ లో ఫ్యాన్ పార్టీ వారు తరచూ మదన పడుతున్న విషయం ఇది. అంటే తొలి దెబ్బతో టీడీపీ ఇంకా దారికి రాలేదని, పైగా తమ తోవకు అడ్డుగా ఉందని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. టీడీపీ నాయకులు ప్రతీ దానికీ విమర్శలు చేయడం, అభివృద్ధిని అడ్డుకోవడం వంటివి తట్టుకోలేకపోతున్నామని కూడా అంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే మళ్ళీ జనమే చూపించాలని కూడా వారు అంటున్నారు. తొలిసారి ఇచ్చిన స్ట్రాంగ్ డోస్ సరిపోవడంలేదు. 2024 ఎన్నికల్లో ఇంకా గట్టిగా దెబ్బ కొట్టాల్సిందే అంటున్నారు వైసీపీ మంత్రులు

ఈసారి అవుట్….?

ఈ మాట అన్నది ఎవరో కాదు అలుగుటయే ఎరుగని అజాత శత్రువు అన్న మాటకు అచ్చం సరిపోయే ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్. టీడీపీకి జనాలే మళ్ళీ గుణపాఠం చెప్పాలి అంటూ ఆయన తాజాగా అంటున్నారు. మాకు జనాలు అధికారం ఇచ్చారు. మేము ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని, అయినా కూడా బురద జల్లుతూ మాకు అడ్డుతగులుతున్న టీడీపీ సంగతిని జనమే చూసుకోవాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజలు ఈసారి టీడీపీకి చావు దెబ్బ తీయాలని, తీస్తారని కూడా ధర్మాన జోస్యం చెప్పేశారు. ఈసారి ఎన్నికలే టీడీపీకి చివరివి అవుతాయని కూడా ఆయన అంటున్నారు.

జనమే దిక్కు….

ప్రజలు వైసీపీని మెచ్చి 2019 ఎన్నికల్లో 151 సీట్లను కట్టబెట్టారు. కేవలం 23 సీట్లను మాత్రమే టీడీపీకి ఇచ్చారు. అయినా కూడా టీడీపీ ఎక్కడా తగ్గడంలేదు. అడుగడుగునా వైసీపీ దూకుడుకు బ్రేకులు వేస్తోంది. దాన్ని అనుభవమని తమ్ముళ్లు గర్వంగా చెప్పుకుంటే అడ్డదారులు అని వైసీపీ ఎకసెక్కం చేస్తోంది. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని టీడీపీ బరితెగించి చేస్తున్న ఈ విన్యాసాలను జనం గమనిస్తున్నారని మంత్రులు అంటున్నారు. పేదల నోటి కాడ కూడు లాగేసుకునే రాజకీయానికి వారే స్వస్తివాచకం పలుకుతారు అంటున్నారు. అలా టీడీపీని నిలువరించడం మా వల్ల కావడం లేదని ఇండైరెక్ట్ గా మంత్రులు ఒప్పేసుకుంటున్నారు. మళ్ళీ జనమే ఓడించి తమకు మరోమారు అధికారాన్ని ఇవ్వాలని కూడా మూడేళ్లకు ముందే అప్పీల్ చేసుకుంటున్నారు.

అది నిజమేనా …?

తెలుగుదేశం పార్టీకి నిజానికి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు అని వైసీపీ నాడు ఊదరగొట్టింది. దానికి తగినట్లుగానే జనం కూడా ఏకంగా ఘోర పరాజయమే పసుపు పార్టీకి రుచి చూపించారు. చంద్రబాబు ప్లేస్ లో ఎవరు ఉన్నా ఈ పాటికి దుకాణం సర్దేసేవారే. కానీ బాబు మాత్రం ఓటమిని అసలు అంగీకరించని మనస్తత్వం కావడంతో గత రెండేళ్ళూ వైసీపీ పాలకులకు హాయిగా నిద్ర పోయే రోజూ ఒక్కటీ లేకుండా చేశారు అంటున్నారు. దాంతో మరో మూడేళ్ళు అధికారం చేతిలో ఉండగానే వైసీపీకి మండుకొస్తోంది. ఇన్ని సీట్లు ఇంత అధికారం ఉన్నా కూడా టీడీపీ వ్యూహాలను ఏమీ చేయలేకపోతున్నామని తెగ బాధపడుతున్నారు. అందుకే మళ్ళీ మళ్లీ టీడీపీని జనాలు ఓడించాలని అంటున్నారు. మరి ఒక అయిదేళ్ల పాలన తరువాత ఏ సర్కార్ మీద అయినా ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ మేరకు విపక్షం కూడా పుంజుకుంటుంది. ఇపుడున్న స్థితిలో చూస్తే జగన్ కి మరో మారు అధికారం దక్కడం ఖాయమే కానీ ఇన్ని సీట్లు దక్కుతాయన్న అన్నదే డౌట్. అదే సమయంలో టీడీపీకి 23 సీట్లకు బదులు రేపు ఏ 46 సీట్లో వస్తే వైసీపీ పాలకుల సంగతేంటి అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి ధీటుగా వ్యూహాలను ఎదుర్కొనే నైపుణ్యం వైసీపీ ఇప్పటికైనా సంపాదించాలన్న సూచన మాత్రం అన్ని వైపులా వినిపిస్తోంది.

Tags:    

Similar News