సాహసం చేయకుంటే ఇక అంతే?

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించడం లేదు. బీజేపీ ప్రభుత్వానికి సరైన ప్రతిపక్షమే లేదని ప్రజలు భావిస్తున్నారు. వరస ఓటములు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని [more]

Update: 2020-11-24 18:29 GMT

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించడం లేదు. బీజేపీ ప్రభుత్వానికి సరైన ప్రతిపక్షమే లేదని ప్రజలు భావిస్తున్నారు. వరస ఓటములు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ముందుగానే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా జరిగిన బీహార్ ఎన్నికలు, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవ ప్రదర్శన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆంతా రాహుల్ వల్లనేనా?

కాంగ్రెస్ లో ఉన్న లోపమేంటి? అన్న చర్చ జరుగుతోంది. నాయకత్వ లోపమా? బలమైన బీజేపీ ముందు కాంగ్రెస్ నిలబడలేకపోతుందా? అన్నది పార్టీ నేతలకు కూడా అర్థం కాకుండా ఉంది. అంతా రాహుల్ గాంధీ వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలను స్వీకరించకపోవడం పిల్ల చేష్టలుగా వారు అభివర్ణిస్తున్నారు.

మరింత దిగజారి….

బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పెద్దగా పెర్ ఫార్మెన్స్ చూపే అవకాశం లేదు. దీంతో రాహుల్ గాంధీకి ముందు ముందు మరిన్ని గడ్డురోజులు ఉండే అవకాశముంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తుంది. ఏడేళ్లలో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ సొంతం చేసుకోలేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి.

విశ్లేషించుకునే ధైర్యం కూడా….

దీనికి రాహుల్ గాంధీ నాయకత్వ లోపమేకారణమంటున్నారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టరు. అలాగని మిగిలిన సీనియర్ నేతలకు స్వేచ్ఛ నివ్వడం లేదు. సీనియర్ నేతల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అనుభవంతో కూడిన ఆలోచనలు చేయలేదంటున్నారు. ఎన్నికల ఫలితాలపై కనీసం విశ్లేషణ జరిపేందుకు కూడా రాహుల్ గాంధీ సాహించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోకుంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది.

Tags:    

Similar News