గరుడ పురాణం స్టార్ట్ చేయించారే…

గరుడ పురాణం శివాజీ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. మొన్నటి ఎన్నికల ముందు తనను సపోర్ట్ చేసే ఎల్లో మీడియాల అండదండలతో వైసిపి, టిడిపిపై [more]

Update: 2020-01-06 05:21 GMT

గరుడ పురాణం శివాజీ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. మొన్నటి ఎన్నికల ముందు తనను సపోర్ట్ చేసే ఎల్లో మీడియాల అండదండలతో వైసిపి, టిడిపిపై ఆయన చేసిన డ్యాన్స్ రెండు రాష్ట్రాల్లో జబర్దస్త్ షో ను మించిన కామెడీని అందించింది. అయితే టివి 9 వివాదంలో స్నేహితుడు రవి ప్రకాష్ కి సాయపడబోయి శివాజీ నిండా కేసుల్లో మునిగిపోయారు. దాంతో కోర్ట్ బెయిల్ మంజూరు చేసేదాక శివాజీ కొన్ని నెలలపాటు పత్తా లేకుండా పోయారు. తెలుగు రాష్ట్రాల్లో అటు కెసిఆర్, ఇటు జగన్ ప్రభుత్వాలు కొలువుతీరడంతో టిడిపి బాకా ఉదితే లేని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని దేశం కోసం రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నట్లు తనకు తాను స్వయంగా ప్రకటించుకునే శివాజీ ఇటీవల న్యూస్ ఛానెల్స్ లో ఐటమ్ గా లేకుండాపోయారు.

మూడు రాజధానులతో….

జగన్ మూడు రాష్ట్రాల ప్రకటన తరువాత సినీ పరిశ్రమ నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. చిరంజీవి వంటివారు జగన్ కి అండగా నిలబడి అదే కరెక్ట్ అనేశారు. ఇక మరో మూవీ లెజెండ్ బాలకృష్ణ ఉలుకు పలుకు లేకుండా పోయారు. రాజధాని భూముల వివాదంలో బాలయ్య పేరు వినిపిస్తున్న స్థితిలో ఆయన వ్యూహాత్మక మౌనం ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ తప్ప మరెవరు అమరావతి తరలించకండి అంటూ సినీ జనం నుంచి వాయిస్ లేకపోవడంతో టిడిపి ఛానెల్స్ రేటింగ్స్ పడిపోతున్నాయి. కేవలం , రైతులు, అధికార ,విపక్షాల వ్యాఖ్యలతోనే న్యూస్ నడుస్తుంది. ఈ స్థితిలో తిట్టి, తిట్టించుకునే సెలబ్రెటీ కావాలి. సరిగ్గా ఆ సమయంలో టిడిపి మీడియా కు గరుడ పురాణం ను తెరపైకి మరోసారి తెచ్చేసారు.

పస లేని పురాణం…

అయితే గరుడ శివాజీ కి రేటింగ్స్ పడిపోయాయి. గత ఎన్నికల తరువాత ప్రజలు పూర్తిగా అతని మాటలు పట్టించుకోవడం మానేశారు. దీనికి తోడు టివి 9 వివాదం తో శివాజీ ఎవరి ట్రంప్ కార్డో తేలిపోయింది. దాంతో ప్రస్తుతం గరుడ శివాజీ కామెడీ పకోడిగా ప్రేక్షకుల్లో మారిపోయారు. కాలర్స్ అడిగే ప్రశ్నలకు సైతం తలా తోకాలేని జవాబులు తన వ్యక్తిగత అంశాలు ఆరోపణలు చేసిన వారికి బూతులతో జవాబులు ఇస్తూ అసహనంతో ఊగిపోతున్నారు. పురాణం ఎపిసోడ్ కూడా రక్తి కట్టకపోవడంతో ఇప్పుడు మరో సెలబ్రెటీ కోసం పసుపు మీడియా అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆ బలిచక్రవర్తి ఎవరో చూడాలి.

Tags:    

Similar News