ఈ టీడీపీ నేత పెద్ద షో మాస్టర్

రాష్ట్రంలో తీవ్రస్థాయిలో దెబ్బతిన్న టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాయ‌కులు త‌మ [more]

Update: 2020-09-03 15:30 GMT

రాష్ట్రంలో తీవ్రస్థాయిలో దెబ్బతిన్న టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాయ‌కులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌ను గాలికి వ‌దిలేయ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ప‌రిస్థితి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్నప్పటికీ.. తూర్పుగోదావ‌రి జిల్లాలో కీల‌క‌మైన రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇక్కడ 2009, 2014 ఎన్నిక‌ల్లో పెందుర్తి వెంక‌టేష్ వ‌రుస విజ‌యాలు సాధించారు. 2009లో చిట్టూరి ర‌వీంద్రను ఓడించిన ఆయ‌న 2014లో జ‌క్కంపూడి విజ‌య‌ల‌క్ష్మిపై గెలుపు గుర్రం ఎక్కారు.

నియోజకవర్గ అభివృద్ధిని కూడా….

2009లో పున‌ర్విభ‌జ‌న‌లో కొత్తగా ఏర్ప‌డిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ పూర్తిస్థాయిలో డెవ‌ల‌ప్ అవుతుంద‌ని చంద్రబాబు భావించారు. ఇక 2004లో అప్పడు ఉన్న బూరుగుపూడి నియోజ‌క‌వ‌ర్గం ఐదేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో అభివృద్ధికి నోచుకోలేదు. అందుకే 2009లో ఇక్కడ ప్ర‌జ‌లు వెంక‌టేష్‌ను గెలిపించారు. 2009లో వెంక‌టేష్ గెలిచినా.. పార్టీ ఓడిపోయింది. దీంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఏమీ చేయ‌లేక పోయారు. ఇక‌, 2014లో గెలుపు గుర్రం ఎక్కి, పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఏమైనా చేస్తార‌ని అనుకున్నా నియోజ‌క‌వ‌ర్గానికి ఒర‌గ‌బెట్టిందేం లేదు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఓ షో మాస్టర్ మాదిరిగా వ్యవ‌హ‌రించారే త‌ప్పా వ‌రుస‌గా రెండుసార్లు గెలిపించిన ప్రజ‌ల స‌మ‌స్యలు తీర్చాల‌న్న థృక్పథంతో వ్యవ‌హ‌రించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

చంద్రబాబు పైనే భారం వేసి…..

రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని మూడు మండ‌లాల్లో రోడ్ల ప‌రిస్థితి అధ్వానంగా ఉంది. దీంతో వెంక‌టేష్‌పై నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజ‌లు పెట్టుకున్న ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఇక కాపు వ‌ర్గం పూర్తిగా దూర‌మైంది. పైగా ఆయ‌న హైద‌రాబాద్‌లో త‌న‌ వ్యాపారాల్లోమునిగి తేలార‌న్న టాక్ నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల్లో బ‌లంగా వ‌చ్చేసింది. నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు మేర కూడా అభివృద్ధి ముందుకు సాగ‌లేదు. ఈ ప‌రిణామాల‌తో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వెంక‌టేష్‌ జ‌క్కంపూడి రాజా చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు. వాస్తవానికి వెంక‌టేష్‌పై చంద్రబాబు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ ఎన్నిక‌ల‌ను ఉదాసీనంగా తీసుకోవ‌డ‌మో.. లేదా చంద్రబాబు హ‌వానే త‌న‌ను గెలిపిస్తుంద‌ని అనుకున్నారో.. తెలియ‌దు. దీంతో ఎన్నిక‌ల‌కు కూడా వెంక‌టేష్ పెద్దగా ఖ‌ర్చు పెట్టలేద‌ని టీడీపీ వ‌ర్గాలే గుస‌గుస‌లాడుకున్నాయి.

పత్తా లేకుండా పోయారే….

ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జమే అనుకున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న క‌నిపించ‌క‌పోవ‌డం, కార్యక‌ర్తల‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని సొంత పార్టీ నేత‌లే ఆరోపిస్తున్నారు. క‌నీసం.. పార్టీ కార్యక్రమాల‌కు కూడా హాజ‌రు కాక‌పోవడం, జ‌గ‌న్ స‌ర్కారుపై చంద్రబాబు చేస్తున్న అనేక పోరాటాల‌నుకూడా వెంక‌టేష్ లైట్‌గా తీసుకోవ‌డం వంటి ప‌రిణామాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లు టీడీపీని ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక్కడ చిత్రమైన విష‌యం ఏంటంటే.. రాజ‌మండ్రి సిటీ, రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ దూసుకుపోతోంది. కానీ, ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఆనుకుని ఉన్నప్పటికీ.. రాజాన‌గ‌రం ప‌రిస్థితి దారుణంగా ఉంది.

గుర్తొచ్చినప్పుడు మాత్రం….

వెంక‌టేష్‌.. మాత్రం హైద‌రాబాద్‌లోనే ఉంటూ… ఇక గుర్తొచ్చిన‌ప్పుడు ప్రెస్‌నోట్లు విడుద‌ల చేయ‌డంతోనే స‌రిపెట్టుకుంటున్నారు. దీంతో పార్టీ దారుణంగా దెబ్బతింటుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక మ‌రో టాక్ ఏంటంటే ఆయ‌న వ్యాపారాల దృష్ట్యా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్‌గా ఉంటే త‌న‌ను ఎక్కడ టార్గెట్ చేస్తారో అన్న డౌట్‌తోనే ఆయ‌న పార్టీని కూడా పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సొంత పార్టీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కాపు కార్పొరేష‌న్ చైర్మన్ జ‌క్కంపూడి రాజా దూసుకుపోతుంటే రాజాను ఎదుర్కొని పార్టీని నిల‌బెట్ట‌లేని దుస్థితి ఇక్కడ టీడీపీకి ఉంది.

Tags:    

Similar News