జ‌గ‌న్ ద‌గ్గర ఈ మంత్రి గ్రాఫ్ ఏ రేంజ్‌లో ఉందంటే..?

మంత్రి అని తీరిగ్గా తిని కూర్చుంటే.. ఏం లాభం అనుకున్నారో.. ఏమో.. 67 ఏళ్ల వ‌య‌సులోనూ ఆయ‌న దూకుడుగా రాజ‌కీయాలు చేస్తున్నారు. యువ మంత్రుల‌కు, నేత‌ల‌కు ఏమాత్రం [more]

Update: 2021-05-10 06:30 GMT

మంత్రి అని తీరిగ్గా తిని కూర్చుంటే.. ఏం లాభం అనుకున్నారో.. ఏమో.. 67 ఏళ్ల వ‌య‌సులోనూ ఆయ‌న దూకుడుగా రాజ‌కీయాలు చేస్తున్నారు. యువ మంత్రుల‌కు, నేత‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిని ప్రద‌ర్శిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ పెడుతున్న ల‌క్ష్యాల‌ను ఒక్కొక్కటి నెర‌వేరుస్తూ.. త‌న పేరును మ‌రింత ఇనుమ‌డింప‌జేసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీలో ఆయ‌న నెంబ‌ర్ 2 – 4 అన్న మాట స‌ర్వత్రా వినిపిస్తుండ‌గా.. కొన్ని జిల్లాల్లో మాత్రం నెంబ‌ర్‌-1 అనే మాట వినిపిస్తోంది. ఆయ‌నే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకు న్నారు.

కీలకమైన శాఖను….

వైసీపీ స‌ర్కారు ఏర్పడిన త‌ర్వాత‌.. పంచాయ‌తీరాజ్‌.. గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి బాధ్యత‌లు చేప‌ట్టారు. వాస్తవానికి ఇలాంటి శాఖ‌ల్లో పెద్దగా ప‌ని ఉండ‌దు. ఉన్నా.. పెద్దగా పేరు ఎక్క‌డా వినిపించ‌దు. కానీ, పెద్దిరెడ్డి త‌న‌దైన స్టైల్‌లో దూసుకుపోయారు. ఒక‌వైపు త‌న శాఖ‌ల ప‌నులు చూసుకుంటూనే .. ప్రత్యర్థి పార్టీల‌కు కౌంట‌ర్లు ఇస్తూ.. మీడియ‌లో నిలిచారు. ఈ క్రమంలో వ‌చ్చిన పంచాయతీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ 90శాతం సాధించి తీరాల‌న్న ల‌క్ష్యాన్ని భుజాన వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ.. జ‌గ‌న్ ల‌క్ష్యాన్ని సాధించారు. అదే స‌మయంలో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం, జిల్లా చిత్తూరు, పుంగ‌నూరుల్లో.. కూడా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హ‌వాను కొన‌సాగిస్తున్నారు.

టీడీపీని టార్గెట్ చేస్తూ….

ప్రధానంగా టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజ‌క‌వ‌ర్గం.. కుప్పంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా ఎగ‌రేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒక‌వైపు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తూనే.. మ‌రోవైపు కుప్పంలోనూ రాజ‌కీయాలు చ‌క్కబెడుతున్నారు. ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక‌లోనూ వైసీపీ విజ‌యానికి కంక‌ణం క‌ట్టుకోవ‌డ‌మే కాకుండా జ‌గ‌న్ పెట్టిన మెజారిటీ సాదించేందుకు ఆయ‌న కృషి చేశారు. ఇవ‌న్నీ కూడా ఆయ‌న‌కు జ‌గ‌న్ ద‌గ్గర మంచి మార్కులు ప‌డేలా చేశాయి. ఇక‌, ఇప్పుడు తాజ‌గా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చేసిన కృషి.. ఢిల్లీకి పాకింది.

అవార్డులు కూడా….?

కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయ‌తీరాజ్ దినోత్సవం సంద‌ర్భంగా.. ప్రక‌టించే ఉత్తమ గ్రామ పంచాయ‌తీ అవార్డుల్లో.. ఏకంగా.. ఏపీకి 17 జాతీయ అవార్డులు ల‌భించాయి. ఇది అంత చిన్న విష‌యం.. ప‌క్కన పెట్టేయాల్సిన విష‌యం ఎంత‌మాత్రం కాదు… పొరుగున ఉన్న తెలంగాణ‌కు న‌గ‌ర పాల‌కాల్లో కేవ‌లం 12 అవార్డులు వ‌స్తే..ఏపీకి ఏకంగా 17 అవార్డులు వ‌రించాయి. ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కృషేన‌ని.. మంత్రి వ‌ర్గం తీర్మానం చేయ‌డం గ‌మ‌నార్హం. ప్రధాని న‌రేంద్ర మోడీతో సీఎం జ‌గ‌న్‌కు జ‌రిగిన వర్చువ‌ల్ స‌మావేశంలో ఈ అవార్డుల‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌.. పెద్దిరెడ్డిని అభినందించారు. ఈ ప‌రిణామంతో.. పెద్దిరెడ్డి గ్రాఫ్ జ‌గ‌న్ ద‌గ్గర మ‌రింత పెరిగింద‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు.

Tags:    

Similar News