పయ్యావుల కూడా డిసైడ్ అయిపోయారా?

తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ కుదురుకుంటుందో లేదో తెలియని పరిస్థితి. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అధికార [more]

Update: 2020-07-29 15:30 GMT

తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ కుదురుకుంటుందో లేదో తెలియని పరిస్థితి. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ కూడా జెండా పీకేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు అనేక కారణాలు కూడా చూపుతున్నారు. సోషల్ మీడియాలో పయ్యావుల కేశవ్ పార్టీ మారతారన్న అంశం చర్చగా మారింది.

మంచి పదవి ఇచ్చినా…..

మొన్న జరిగిన ఎన్నికల్లో రాయలసీమ నుంచి ముగ్గురే ముగ్గురు టీడీపీ నుంచి గెలిచారు. అందులో చంద్రబాబు, బాలకృష్ణతో పాటు పయ్యావుల కేశవ్ ఒకరు. అయితే పయ్యావుల కేశవ్ ఎప్పుడు గెలిచినా ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఓటమి పాలయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్యేగా ఆయన అధికారంలో ఎప్పుడూ లేరనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబు పయ్యావుల కేశవ్ కు ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు.

ఏమీ చేయకుండా….

పీఏసీ ఛైర్మన్ పదవి అంటే కేబినెట్ హోదా. అయితే పీఏసీ ఛైర్మన్ గా ఉండి పయ్యావుల కేశవ్ చేసిందేమీ లేదన్నది వాస్తవం. ఆయన ప్రభుత్వంపై విమర్శలు కూడా చేయడం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి రూపాయిని పరిశీలించి బయటపెట్టే పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మాత్రం మౌనంగా ఉండటం కొద్దిరోజులుగా పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ కారణాలతోనే….

అయితే రాయలసీమలో వైసీపీ బలంగా ఉండటం, సంక్షేమ పథకాలను జోరుగా అమలు చేస్తుండటంతో పయ్యావుల కేశవ్ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.టీడీపీ కూడా సీమ ప్రాంతంలో కోలుకోలేని పరిస్థితి వచ్చింది. ఈ మేరకు వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీతో కూడా పయ్యావుల కేశవ్ టచ్ లో ఉన్నారంటున్నారు. పయ్యావుల కేశవ్ కు ప్రాధాన్యత ఇచ్చినా ఆయన యాక్టివ్ గా లేకపోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సయితం అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద పయ్యావుల కేశవ్ కూడా పార్టీ వీడతారన్న ప్రచారం ఎక్కువగా ఉంది.

Tags:    

Similar News