ప‌య్యావుల ఆ పదవిలో ఉన్నట్లా? లేనట్లా?

టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంతపురం జిల్లా ఉర‌వ‌కొండ నుంచి గెలిచిన ప‌య్యావుల కేశ‌వ్‌.. చుట్టూ ఇప్పుడు రాజ‌కీయాలు చ‌క్కర్లు కొడుతున్నాయి. ఉర‌వ‌కొండ నుంచి కొన్ని ద‌శాబ్దాలుగా ప‌య్యావుల [more]

Update: 2020-06-04 00:30 GMT

టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంతపురం జిల్లా ఉర‌వ‌కొండ నుంచి గెలిచిన ప‌య్యావుల కేశ‌వ్‌.. చుట్టూ ఇప్పుడు రాజ‌కీయాలు చ‌క్కర్లు కొడుతున్నాయి. ఉర‌వ‌కొండ నుంచి కొన్ని ద‌శాబ్దాలుగా ప‌య్యావుల కేశవ్ రాజ‌కీయాలు చేస్తున్నారు. వివాద ర‌హితుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. పార్టీలోనూ వివాదాల‌కు ఆయ‌న దూరంగా ఉంటారు. ఎంద‌రో పైర్ బ్రాండ్లు ఉన్నప్పటికీ.. పార్టీలో ఆయ‌న అధినేత మాట‌కు విలువ ఇచ్చే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. అయితే, ఇప్పుడు ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని వైసీపీ నేత‌లు ప్రయ‌త్నిస్తున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది.

టీడీపీని బలహీనపర్చడం ద్వారా…

టీడీపీకి అత్యంత బ‌ల‌మైన జిల్లాగా ఉన్న అనంత‌పురంలో ఆ పార్టీని బ‌ల‌హీన ప‌ర‌చ‌డం ద్వారా వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణయించుకుంది. ఈ నేప‌థ్యంలోనే పార్టీలో కీల‌క నేత‌ల‌పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను వైసీపీ ప్రయోగిస్తున్న విష‌యం తెలిసిందే. ఇలానే ప‌య్యావుల కేశవ్ పై కూడా అనంత‌పురం నాయకులు ఆక‌ర్ష్ వ‌ల విసిరార‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. అయితే, ఆయ‌న ఎలాంటి నిర్ణయ‌మూ తీసుకోలేద‌ని.. ఊగిస‌లాట ధోర‌ణిలో ఉన్నార‌ని అంటున్నారు. నిజానికి గ‌త ఏడాది సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప‌య్యావుల కేశవ్ కు వైసీపీ ఆఫ‌ర్ ఇచ్చింద‌నే ప్రచారం జ‌రిగింది.

అందుకే పదవి ఇచ్చి….

ఈ క్రమంలోనే ఇప్పుడు మ‌రోసారి వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని అంటున్నారు. వాస్తవానికి వైసీపీ వైపు ప‌య్యావుల కేశవ్ చూస్తున్నార‌నే నేప‌థ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయ‌న‌కు పీఏసీ చైర్మన్‌గా బాధ్యత‌లు అప్పగించి.. పార్టీలోనే ఉండేలా చేశార‌ని అంటారు. అయితే, పీఏసీ చైర్మన్ అయిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు ఒక్కసారి కూడా ప‌య్యావుల భేటీ నిర్వహించ‌లేదు. ప్రభుత్వం చేస్తున్న ఖ‌ర్చుల‌ను ప‌ట్టించుకుని చ‌ర్చింది కూడా లేదు. అంటే.. మొత్తానికి ప‌య్యావుల కేశవ్ ఈ ప‌ద‌విలో ఉన్నా కూడా రెండు ప‌డ‌వ‌ల‌పైకాళ్లు కొన‌సాగిస్తున్నార‌నేది వాస్తవ‌మేన‌ని ఆయ‌న అనుచ‌రులు కూడా చెబుతున్నారు.

అసంతృప్తితో ఉన్నారని…..

ఇప్పటికే ప‌య్యావుల కేశవ్ అసంతృప్తితో ఉన్నార‌ని టీడీపీ నుంచి కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయ‌నకు పార్టీలో స‌రైన ప్రాధాన్యం లేద‌ని.. చంద్రబాబు పైకి ఒక‌ర‌కంగా.. త‌ర్వాత మ‌రో ర‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నా ర‌ని, పార్టీలో సీనియ‌ర్లను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌య్యావుల కేశవ్ వ‌ర్గం కొన్నాళ్లుగా ఆరోపిస్తోంది. ఇక‌, వైసీపీ నుంచి కూడా భారీ ఆఫ‌ర్లు వ‌స్తుండ‌డం.. వ‌చ్చే నాలుగేళ్లపాటు టీడీపీ భ‌విత‌వ్యంపై నీలి మేఘాలు క‌మ్ముకోవ‌డం వంటి కార‌ణంగా.. ప‌య్యావుల కేశవ్ ఆచితూచి అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News