ప‌య్యావుల ఉన్నా… ప్రయోజ‌నం లేదా…? టీడీపీలో బిగ్ డిస్కషన్

ప‌య్యావుల కేశ‌వ్‌. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. అనంత‌పురం జిల్లాకు చెందిన వివాద‌ర‌హిత నాయ‌కుడు. అయితే, ఆయ‌న‌పై ఒక సెంటిమెంట్ ఉంది. ఆయ‌న గెలిస్తే.. పార్టీ అధికారం కోల్పోతుంద‌ని, [more]

Update: 2020-03-27 08:00 GMT

ప‌య్యావుల కేశ‌వ్‌. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. అనంత‌పురం జిల్లాకు చెందిన వివాద‌ర‌హిత నాయ‌కుడు. అయితే, ఆయ‌న‌పై ఒక సెంటిమెంట్ ఉంది. ఆయ‌న గెలిస్తే.. పార్టీ అధికారం కోల్పోతుంద‌ని, ఆయ‌న ఓడితే.. పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని.. స‌రే.. ఈ విష‌యాన్ని ప‌క్కన పెడితే.. ఇప్పుడు ఆయ‌న గురించి చిత్రమైన విష‌యం ప్రచారం జ‌రుగుతోంది. ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన ప‌య్యావుల‌కు చంద్రబాబు కీల‌క‌మైన ప‌ద‌విని ఇచ్చారు. ప్రతిప‌క్షానికి ద‌క్కే.. ప్రజాప‌ద్దుల క‌మిటీ చైర్మన్ ప‌ద‌విని ఆయ‌న‌కే అప్పగించారు. దీంతో ప్రభుత్వానికి ఎప్పటిక‌ప్పుడు.. ఎక్కడిక‌క్కడ చెక్ పెడ‌తార‌ని ఆయ‌న అనుకున్నారు. అయితే, దీనికి విరుద్ధంగా ప‌య్యావుల వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రభుత్వంపై సానుకూల కోణంలో ఆయ‌న ఆలోచిస్తున్నారని అంటున్నారు.

రాజీ పడిపోయారా?

ఇటీవ‌ల స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఉర‌వ‌కొండ‌లో టీడీపీ శ్రేణుల స‌త్తా చాటుతార‌ని ప‌య్యావుల‌పై చంద్రబాబు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, దీనికి విరుద్ధంగా ప‌య్యావుల వ్యవ‌హ‌రించారు. వైసీపీ త‌ర‌ఫున మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర‌రెడ్డి దూకుడు పెంచారు. చాలా స్థానాల‌ను ఏక‌గ్రీవం చేశారు. అదే స‌మ‌యంలో టీడీపీకి అడుగ‌డుగునా చెక్ పెట్టారు. నిజానికి ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది. అయితే, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌లు రోడ్ల మీదికి వ‌చ్చి ఆందోళ‌న‌లు చేశారు. ప్రభుత్వంపై విమ‌ర్శలు చేశారు. ఎమ్మెల్యేల‌తో ఒక‌ర‌కంగా యుద్ధమే చేశారు. కానీ, ఉర‌వ‌కొండ‌లో మాత్రం స‌ర్దుకు పోయారు. ఈ ప‌రిణామమే ఇప్పుడు టీడీపీలో చ‌ర్చకు దారితీసింది. అస‌లు ఏం జ‌రుగుతోంది? ప‌య్యావుల కేశవ్ ఇలా ఎందుకు వ్యవ‌హ‌రిస్తున్నారు? అనే కోణంలో టీడీపీ నేత‌లు చ‌ర్చిస్తున్నారు.

బాబుకు సమాచారం లేకుండా….

తాజాగా కూడా పయ్యావుల కేశవ్ పార్టీలైన్‌కు విరుద్ధంగా చంద్రబాబుకు కూడా స‌మాచారం ఇవ్వకుండా సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ఆర్థిక తోడ్పాటు కింద ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు.. రెండు నెలల నిత్యావసర వస్తువు లు ఉచితంగా ఇవ్వాలని కోరారు. కరోనా కారణంగా షట్‌డౌన్‌ దిశగా పరిస్థితులు వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలు జీవనోపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని, పేద ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకో వాలని పయ్యావుల కేశవ్ లేఖలో డిమాండ్ చేశారు.

పార్టీ లైన్ కు విరుద్ధంగా…

వాస్తవానికి ఇలాంటి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వరాద‌ని గ‌తంలోనే చంద్రబాబు ఒక తీర్మానం చేసుకున్నారు. ప్రభుత్వం చేతులు ఎత్తేసే వ‌ర‌కు వేచిచూసి… ఆయా లోపాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. అయితే, దీనికి విరుద్ధంగా ప‌య్యావుల కేశవ్ వ్యవ‌హ‌రించ‌డం, స్థానిక ఎన్నిక‌ల్లోనూ స‌ర్దుకు పోవ‌డం వంటి ప‌రిణామాలు మింగుడు ప‌డ‌డం లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News