పవన్ షాకింగ్ డెసిషన్ ఇదేనా?

జనసేనాని పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనకు మెగాభిమానులు అధికంగా ఉన్న నేపధ్యంలో అక్కడ నుంచి పోటీకి పవన్ రెడీ [more]

Update: 2019-02-01 06:30 GMT

జనసేనాని పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనకు మెగాభిమానులు అధికంగా ఉన్న నేపధ్యంలో అక్కడ నుంచి పోటీకి పవన్ రెడీ అంటున్నారని తెలుస్తోంది. పవన్ సొంత సామాజిక వర్గం కూడా ఇక్కడ దండిగా ఉండడం, బీసీలు, ఇతర వర్గాల మద్దతు కూడా తమ పార్టీకి ఉండడంతో పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీకి రణ క్షేత్రంగా ఉత్తరాంధ్ర ముఖ ద్వారం విశాఖను ఎంచుకున్నారని అంటున్నారు. పవన్ ఆ మధ్యన ఉత్తరాంధ్ర పర్యటన చేసిన సందర్భంగా తనకు ఈ ప్రాంతం అంటే మక్కువ ఎక్కువని చెప్పుకున్నారు కూడా.

బలమైన సీటు…

ఇక ఉత్తరాంధ్రలో జనసేనకు బలమైన సీటుగా ఉత్తర నియోజకవర్గాన్ని భావిస్తున్నారు. ఇక్కడ చిత్రమెంటంటే అటు టీడీపీలో వర్గ పోరు కుమ్ములాటలతో ఏక నాయకత్వం, సమర్ధుడైన క్యాండిడేట్ లేకుండా పోయారు. అదే సమయంలో ఆ పార్టీ గత మూడు ఎన్నికల నుంచి ఈ సీటుని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దాంతో క్యాడర్లోనూ నిరాశ కలుగుతోంది. గత ఎన్నికల్లో ఈ సీటుని బీజేపీకి ఇవ్వడం వల్ల ఆ పార్టీ గెలుచుకుంది. ఇపుడు పొత్తు లేదు, మోడీ గాలి కూడా లేదు. దాంతో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ కి క్యాడర్ ఉన్నా సరైన నాయకత్వం లేదు. ఇంఛార్జిగా నియమించిన కేకే రాజు పై జనంలో ఆదరణ లేదని సర్వేలు వస్తున్నాయి. దాంతో ఆయన్ని పోటీలో ఎవరూ పెద్దగా పట్టించుఓవడంలేదు. ఈ నేపధ్యంలో ప్రధాన పార్టీలు రెండూ చతికిలపడిన ఉత్తరం సీటు నుంచి ఏకంగా జనసేన అధ్యక్షుడు పోటీకి దిగితే బంపర్ మెజారిటీతో గెలుస్తారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

కారణం అదేనా..?

ఇక పవన్ విశాఖలో పోటీకి దిగడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ పట్ల ఆదరణ ఉంది, కానీ అన్ని చోట్లా నాయకత్వం పెద్దగా లేదు. అదే పవన్ కనుక ఇక్కడ పోటీలో ఉంటే ఆ ప్రభావం మిగిలిన సీట్ల మీద కూడా పడి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవచ్చున్నని కూడా వ్యూహ రచన చేస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల్లో చూసుకుంటే టీడీపీ బలం, గ్రాఫ్ బాగా తగ్గుతోంది. అదే టైంలో వైసీపీ గ్రాఫ్ మాత్రం అనుకున్నంతగా పెరగడంలేదు. దాంతో మూడవ పార్టీగా జనసెన‌ దిగితే మంచి ఫలితాలు వస్తాయని, పవన్ ఇక్కడ నుంచే పోటీకి దిగితే జనం మొత్తం అటే ఉంటారని కూడా అంటున్నారు.

ప్రజారాజ్యం సమయంలోనూ….

ఇక పవన్ గత అనుభవాలను కూడా బేరీజు వేసుకుంటున్నారని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ టైంలో విశాఖ జిల్లాలో మాత్రమే ఆ పార్టీ ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకుంది. దాంతో పవన్ ఇపుడు కూడా ఆ గాలి తమ పార్టీకి బాగా వీస్తుందని నమ్ముతున్నారు. విశాఖ అర్బన్ జిల్లాలో పోటీ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇక్కడ వైసీపీ బాగా వీక్ గా ఉంది. టీడీపీని కొట్టే ప్రతిపక్షం లేదు. దాంతో జనసేన పోటీకి దిగి ఆ లోటుని భర్తీ చేస్తుందని అంటున్నారు. మొత్తానిక్ అటు తిరిగి ఇటు తిరిగి పవన్ గాలి విశాఖ వైపు మళ్ళిందని అంటున్నారు.

Tags:    

Similar News