తురుపు ముక్క కావాలనేనా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంబించిన పార్టీ జ‌న‌సేనపై తాజా అంచ‌నాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు కేవ‌లం మూడు మాసాలే గ‌డువు ఉంది. అందులోనూ రెండు నెల్లలోనే [more]

Update: 2019-01-25 05:00 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంబించిన పార్టీ జ‌న‌సేనపై తాజా అంచ‌నాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు కేవ‌లం మూడు మాసాలే గ‌డువు ఉంది. అందులోనూ రెండు నెల్లలోనే ఎన్నిక‌ల కోడ్ కూడా అమ‌లులోకి రానుంది. ఈ ప‌రిణామా ల నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మైన రెండు పార్టీ టీడీపీ, వైసీపీలు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. మ‌రి అదేస‌మ‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు సీఎం పీఠం కోసం సెంటిమెంట్ పండించిన నాయ‌కుడు ప‌వ‌న్ ఆ దిశ‌గా ఊపు చూపించ‌లేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప‌క్షంగా నిలుస్తాడ‌నే ఆశ‌లు కూడా క‌నిపించలేక పోతున్నాయ‌నే విమ‌ర్శ‌లు కూడా ఈ నేప‌థ్యంలోనే వెలుగు చూస్తున్నాయి.

వ్యూహ మెక్కడ…?

ఇప్పటి వ‌ర‌కు ప‌ట్టుమ‌ని ప‌ది స్థానాల్లో కూడా అభ్య‌ర్థుల‌ను ప‌వ‌న్ ఎంపిక చేయ‌లేదు. ముఖ్యంగా టీడీపీకి, వైసీపీకి కంచు కోట‌లుగా ఉన్న దాదాపు 100కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న జెండాను ఎలా ఎగిరించాల‌నే వ్యూహం కూడా ఆయ‌న వ‌ద్ద క‌నిపిం చడం లేదు. పైకి ఎన్ని మాట‌లు చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో బ‌లం పుంజుకోక‌పోతే.. కేవ‌లం ప‌వ‌న్ ముఖం చూసి ఓట్లేస్తా ర‌ని అనుకోవ‌డం మిథ్యే అవుతుంద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల భావ‌న‌. ఇంకే ముంది విజృంభిస్తాం. జ‌న‌వ‌రి రెండు నుంచి ప్ర‌జ‌ల్లోనే ఉంటాను అని గ‌త డిసెంబ‌రులో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు ముందు ప‌వ‌న్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇంకేముంది రాష్ట్రంలో ప‌వ‌న్ దూకుడు పెరుగుతుంద‌ని అధికార పార్టీలో చ‌ర్చ జ‌రిగింది.

జగన్ ను విమర్శించడమే పనిగా….

అయితే, జ‌న‌వ‌రిలో స‌గం రోజులు గ‌డిచిపోయినా కూడా ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌లేదు. ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై దృష్టి కూడా పెట్ట‌లేదు. కీల‌క‌మైన ప్రత్యేక హోదా విష‌యంలో ఆయ‌న ఎలా ముందుకు వెళ్తారో చెప్ప‌లేదు. కేవ‌లం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డ‌మే పెట్టుకున్నారు. దీనిని త‌మ‌కు అడ్వాంటేజ్‌గా టీడీపీ నేత‌లు భావిస్తున్నా రు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు కానీ, త‌ర్వాత కానీ తాను టీడీపీకి మ‌ద్ద‌తిస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం లేదు. అలాగ‌ని చెబితే… ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ వీక్ అయ్యే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి అలాంటి ప్ర‌క‌ట‌న‌ను ఆశించ‌డం కూడా త‌ప్పే. సో.. ఏదేమైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒంట‌రి పోరు అంటూనే ఉన్నా.. దానికి సంబందించిన కార్యాచ‌ర‌ణ‌ను ఇప్ప‌టికీ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఎన్నికల తర్వాత….?

నెల్లూరు, క‌ర్నూలు, క‌డ‌ప, చిత్తూరు వంటి కీల‌క‌మైన జిల్లాల్లోనూ త‌న వ్యూహాన్ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి ప‌వ‌న్ అధికారం ల‌క్ష్యంగా అడుగులు వేయ‌డం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. బ‌లంగా ఉన్న రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుందో దానికి ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా త‌న రాజ‌కీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకు మాత్ర‌మే జానీ ప‌రిమిత‌మ‌య్యాడ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇదే నిజ‌మైతే.. ప‌వ‌న్ ఓ తురుపు ముక్క‌గా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News