పవన్ నేడు తేల్చేయనున్నారా?

జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తులపై స్పష్టత ఇచ్చారు. తెలుగుదేశంపార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసేది లేదని తెగేసి చెప్పారు. వామపక్షాలతో కలసి జనసేనాని నడవనున్నారు. ఇక ప్రత్యర్థి [more]

Update: 2019-01-25 03:30 GMT

జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తులపై స్పష్టత ఇచ్చారు. తెలుగుదేశంపార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసేది లేదని తెగేసి చెప్పారు. వామపక్షాలతో కలసి జనసేనాని నడవనున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆయన వామపక్షాలతో నేడు చర్చలు ప్రారంభించనున్నారు. ఈరోజు వామపక్షాలతో సమావేశం కానున్న పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చంచనున్నారు. విశాఖ పట్నంలో జరిగే ఈ సమావేశంలో వామపక్ష అగ్రనేతలు కూడా పాల్గొననున్నారు.

టీడీపీ మైండ్ గేమ్ కు…..

పవన్ కల్యాణ్ తమతో కలసి వస్తారని తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ ప్రారంభించింది. పవన్ తో చర్చలు మార్చిలో ప్రారంభమవుతాయని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చెప్పిన కొద్దినిమిషాల్లో పవన్ ఫైరయ్యారు. తాము ఏపార్టీతో పొత్తు పెట్టుకోమని తేల్చిచెప్పారు. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని స్పష్టమైన సంకేతాలను పవన్ కల్యాణ్ ఇచ్చారు. అయినా తెలుగుదేశం పార్టీ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో పవన్ పొత్తులపై పోస్టింగ్ లతో అయోమయానికి గురిచేస్తున్నాు.

చెక్ పెట్టాలని….

వీటన్నింటికీ చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ వామపక్షాలతో కలిసి చర్చించి ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఈరోజు జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటు అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే వామపక్షాలు తాము ఏ ప్రాంతంలో పోటీ చేస్తామన్న దానిపై ఒక నివేదికను జనసేనానికి ఇచ్చారు. కర్నూలు, అనంతపురం, కడప, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని సీట్లలో పోటీ చేయాలని వామపక్షాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వ్ డ్ నియోజకవర్గాలను వామపక్షాలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

పదిహేను రోజుల్లో సీట్లపై….

వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు కలసి 25 నుంచి 30 స్థానాలను ఆశిస్తున్నాయి. గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన సీట్లతో పాటు మరికొన్ని సీట్లను అదనంగా వామపక్షాలు కోరుతున్నాయి. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. విశాఖపట్నంలోని ప్రియా రిసార్ట్స్ లో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి పదో తేదీ నాటికి సీట్ల సర్దుబాటు పూర్తి కావాలన్న నిర్ణయంతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. వామపక్ష పార్టీలో సీట్లు సర్దుబాటు అయితే పవన్ కూడా జనసేన అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉన్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఈరోజు సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిట ఇవ్వనున్నారు.

Tags:    

Similar News