వకీల్ సాబ్ కోసం…కొత్త రాజకీయ ట్రైలర్ విడుదల చేసిన బాబు ?

ప్రస్తుతం ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ తోడు కోసం వెయిట్ చేస్తున్నారు. అది బలమైన కాపు సామజిక వర్గ ఓటు బ్యాంక్ ఉన్న పవన్ కళ్యాణ్ [more]

Update: 2021-04-10 09:30 GMT

ప్రస్తుతం ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ తోడు కోసం వెయిట్ చేస్తున్నారు. అది బలమైన కాపు సామజిక వర్గ ఓటు బ్యాంక్ ఉన్న పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఎదురు చూపులు అన్నవి మరోసారి తిరుపతి ఎన్నికల కోసం చేస్తున్న చంద్రబాబు ప్రసంగాలు అద్దం పడుతున్నాయి. ఎన్నికల్లో తమ పార్టీ గతంలో చేసినవి చెప్పుకోవడం అధికారంలో ఉన్న జగన్ పార్టీని దుమ్మెత్తి పోయడం ఆయన ప్రచారంలో ప్రధాన అంశాలు. అయితే అంతకుమించి ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరతీశాయి. ప్రస్తుతం బిజెపి జనసేన తిరుపతి లోక్ సభ స్థానం ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అలాంటిది పవన్ పై జగన్ సర్కార్ కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందంటూ జనసైనికుల మనసు దోచుకునేందుకు వ్యూహం లో భాగంగా చంద్రబాబు వ్యాఖ్యలు హీట్ పుట్టించాయి.

ప్రీమియర్ షో కాదక్కడ …

పవన్ తాజా చిత్రం వకీల్ సాబ్ విడుదల సందర్భంగా ఎపి లో ప్రీమియర్ షో లకు అనుమతిని ఇవ్వలేదు ఎపి ప్రభుత్వం. ఇది పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పెట్టె అంశమే. అసలే కోవిడ్ సమయం కావడంతో వచ్చే వసూళ్లు ఎంత ఉంటాయి ఎలా ఉంటాయన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడుతుందో తెలియదు. ఎంత తొందరగా వసూళ్ళు జరిగితే నిర్మాతలకు ఊరట లభిస్తుంది. కానీ కలెక్షన్ల వర్షం కురిపించే పవర్ స్టార్ చిత్రం కు ప్రీమియర్ షో లకు అనుమతి కరోనా పేరుతో లభించకపోవడంతో ఆర్ధికంగా గట్టి దెబ్బ తిన్నట్లే.

భవిష్యత్ కోసమేనా?

దీనిపై పవన్ గట్టిగా ప్రశ్నించలేకపోయినా ఆయన తరపున ఈ అంశంపై చంద్రబాబు గళం విప్పారు. జగన్ కక్ష సాధింపు చర్యలు ఎలా ఉంటాయో ఉదాహరణలు చెప్పే నేపథ్యంలో అన్నట్లు పవన్ వైపే తన చూపు అన్న స్పష్టత ఇచ్చేశారు చంద్రబాబు. దీనిద్వారా ఒక్క తిరుపతి ఉప ఎన్నికల్లో జనసైనికుల మనసు దోచుకోవడమే కాదు భవిష్యత్తులో పవన్ తో చేతులు కలపడానికి మరిన్ని అవకాశాలు సృష్ట్టించారు రాజకీయ చాణుక్యుడు బాబు. అయితే ఆయన ప్రస్తుతం పవన్ తో కలిసి నడవక తప్పని రాజకీయ అనిశ్చితికి తెరదించే ట్రైలర్ చంద్రబాబు విడుదల చేసేసారు. ఇక మరిన్ని టీజర్లు ఆయన నుంచి రానున్నట్లు స్పష్టం అవుతుంది. పూర్తి సినిమా మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే విడుదలకానుంది.

Tags:    

Similar News