మిత్రుడు మౌనం వెనుక వ్యూహం ఏమైనా ఉందా?

రాష్ట్రంలో బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ మాట‌ల మంట‌లు కొన‌సాగుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన ద‌క్షిణ కొరియా కిట్ల విష‌యంపై బీజేపీ ఏపీ సార‌థి, సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు [more]

Update: 2020-04-22 05:00 GMT

రాష్ట్రంలో బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ మాట‌ల మంట‌లు కొన‌సాగుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన ద‌క్షిణ కొరియా కిట్ల విష‌యంపై బీజేపీ ఏపీ సార‌థి, సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విరుచుకుప‌డ్డారు. ఈ కిట్ల కొనుగోలులో తీవ్ర అవినీతి జ‌రిగింద‌ని, వైసీపీ నాయ‌కులు క‌మీష‌న్లు తీసుకున్నార‌ని, లేకుంటే.. ఇత‌ర రాష్ట్రాలు అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే ఈ కిట్లు కొంటున్నప్పుడు మ‌నం మాత్రం 700 చిల్లర‌కు ఎందుకు కొనాల్సి వ‌చ్చింద‌ని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ మంత్రులు , ఇత‌ర నాయ‌కులు సైలెంట్‌గా ఉన్నారు. కానీ, రాజ్యస‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మాత్రం క‌న్నాను టార్గెట్ చేసి ఆయ‌న అమ్ముడు పోయార‌ని అన్నారు.

టార్గెట్ చేసినట్లు తెలుస్తున్నా…..

విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యల‌పై క‌న్నా మ‌రింత ఫైర్ అయ్యారు. నువ్వు మ‌గాడివైతే.. అంటూ… ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. ఇక‌, క న్నాకు రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కూడా అండ‌గా నిలిచారు. ఇది స‌మంజ‌సం కాదంటూ.. విజ‌య‌సాయిపై విరుచుకుప‌డ్డారు. అ యినా, తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. మీకెందుకు? అంటూ వారు ఎదురు దాడి చేశారు. ఇలా ఈ రెండు పార్టీల మ‌ధ్య తీవ్ర యుద్ధం జ‌రుగుతోంది. అయితే, బీజేపీకి వెన్నుద‌న్నుగా ఉంటానంటూ.. ఇటీవ‌ల కాలంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కానీ, ఆయ‌న పార్టీ కీల‌క నేతలు, అదే గుంటూరు జిల్లాకు చెందిన నాయ‌కులు ఈ విష‌యంలో ఒక్క మాట కూడా ఎత్తక పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి బీజేపీకి ఇది కీల‌క స‌మ‌యం.

ఢిల్లీ స్థాయికి చేరినా….

క‌న్నా చేసిన ఆరోప‌ణ‌లు క‌నుక నిజం అయితే.. జ‌గ‌న్ ప్రభుత్వాన్ని బోనులోకి నెట్టే అవకాశం ఖ‌చ్చితంగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు. ఆది నుంచి కూడా వైసీపీని వ్యతిరేకిస్తున్న ప‌వ‌న్ కల్యాణ్ కు ఇప్పుడు క‌న్నా ఎత్తుకున్న అంశం మంచి ఆయుధ‌మనే చెప్పాలి. నిజంగానే క‌రోనా కిట్లకు ప్రభుత్వం ఎక్కువ ధ‌ర పెట్టి కొనుగోలు చేసి ఉంటే.. క‌న్నా ఆరోపించిన‌ట్టు ఈ విష‌యంలో ప్రభుత్వం క‌మీష‌న్లు తీసుకుని ఉన్నా.. ప‌వ‌న్ కల్యాణ్ త‌న వాయిస్ వినిపించేందుకు ఇది స‌రైన స‌మ‌యం. కానీ, ఆయ‌న మౌనం వ‌హించారు. ఆయ‌న పార్టీ త‌ర‌ఫున కూడా ఎక్కడా ఒక్క మాట కూడా వినిపించ‌డం లేదు. నిజానికి ఈ ర‌గ‌డ‌.. ఢిల్లీ స్థాయికి కూడా చేరింద‌ని అంటున్నారు.

అందుకేనా మౌనం?

విజ‌య‌సాయి క‌న్నాపై ఢిల్లీలోని బీజేపీ పెద్దల‌కు ఫిర్యాదు చేశార‌ని కూడా స‌మాచారం. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ జోక్యంచేసుకుని ఉంటే.. క‌న్నాకు మంచి మ‌ద్దతు ల‌భించి ఉండేది. కానీ, ప‌వ‌న్ కల్యాణ్ మాత్రం ఈ విష‌యాన్ని వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ కాకుండా.. క‌న్నా వ‌ర్సెస్ విజ‌య‌సాయిగా చూస్తున్నారా ? అందుకే ఆయ‌న మౌనం వ‌హించారా ? అనే చ‌ర్చ సాగుతోంది. ఇలా అయితే, కేంద్రంలో బీజేపీతో సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం జ‌న‌సేన-బీజేపీ సంబంధాలు బెడిసి కొట్టవా ? అనేది ప్రశ్న. మ‌రి జ‌న‌సేనాని ఎలాడిసైడ్ అయ్యారో ? చూడాలి.

Tags:    

Similar News