జగన్ పాలనపై పవన్

వైఎస్ జగన్ వందరోజుల పాలనపై పవన్ కల్యాణ్ పార్టీ నివేదిక విడుదల చేసింది. 33 పేజీలతో ఉన్న నివేదికలో వైసీపీ పాలనలో జరిగిన తప్పొప్పులను ఎత్తి చూపింది. [more]

Update: 2019-09-14 06:07 GMT

వైఎస్ జగన్ వందరోజుల పాలనపై పవన్ కల్యాణ్ పార్టీ నివేదిక విడుదల చేసింది. 33 పేజీలతో ఉన్న నివేదికలో వైసీపీ పాలనలో జరిగిన తప్పొప్పులను ఎత్తి చూపింది. పాలనలో పారదర్శకత, దార్శినికత లోపించిందన్నారు. వంద రోజుల పాలన ప్రణాళికబద్ధంగా లేదన్నారు పవన్ కల్యాణ్, ఇసుక సమస్య, ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులపై జనసేన అధ్యయనం చేసిందన్నారు పవన్ కల్యాణ్. తాము నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తామని చెప్పారు. ప్రభుత్వంపై చౌకబారు ఆరోపణలు చేయబోమన్నారు. రాజకీయ నేతల మాటలు మార్చడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆరోగ్యకరమైన పాలన జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.

జనరంజకం… జన విరుద్ధం…..

సంవత్సరం వరకూ మాట్లాడే అవకాశం రాదని తాను భావించానన్నారు. రెండు వారాల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనకరంగా మారాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్రాభివృద్ధిని ప్రశ్నార్థకం చేశాయన్నారు. వందరోజుల పాలనలో నవరత్నాలు జనరంజకమైనవని… పాలన జనవిరుద్ధమపి పవన్ కల్యాణ్ అభివర్ణించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఇసుక విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయం ఆందోళనకు కారణమయిందన్నారు. టీడీపీని కూల్చింది ఇసుక మాఫియేనని అందరకూ తెలుసునన్నారు. వరద నిర్వహణలోనూ ప్రభుత్వం విఫలమయిందని పవన్ కల్యాణ్ చెప్పారు. పెట్టుబడులు రాకపోవడానికి కారణం వైసీపీ నేతల వ్యవహారశైలి కారణమని తెలిపారు. కియా పరిశ్రమ నిర్వాహకులను వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతుంటే ఇక పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రభుత్వంలాగే పరిశ్రమల పట్ల వ్యవహరించాలి గాని పార్టీగా వ్వవహరించకూడదని పవన్ కల్యాణ్ అన్నారు.

Tags:    

Similar News