స్వరం మార్చింది అందుకేనా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తాము ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఫెడరల్ ఫ్రంట్ చేరే [more]

Update: 2019-01-21 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తాము ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఫెడరల్ ఫ్రంట్ చేరే విషయంలోనే టీఆర్ఎస్ తో చర్చించాము తప్ప ఏపీలో ఎవరితో కలిసేది లేదని వైసీపీ తేల్చి చెప్పింది. ఇక అధికార తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందా? లేదా? అన్నది ఇంకా తేల్చలేదు. కాంగ్రెస్ పార్టీతో కలవకుండా విడిగా పోటీ చేస్తేనే మంచిదన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతుంది. జగన్ పార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ కొంతైనా చీల్చగలదని, అందుకోసం ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి నడవకూడదని ఎక్కువ మంది తమ అధినేత చంద్రబాబును కలసినప్పుడల్లా చెప్పి వస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన అహ్మదుల్లాను పార్టీలోకి చేర్చుకోవడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బాబు మాత్రం బలంగా…..

ఇక చంద్రబాబు బలంగాకోరుకుంటుంది పవన్ తో పొత్తు ఉండాలని. అందుకే ఇటీవల పవన్ పక్కన పెట్టి జగన్,కేసీఆర్,మోదీలపైనే ఎక్కువ విమర్శలకు దిగుతున్నారు. ముగ్గురు మోదీలంటూ వారినే టార్గెట్ చేశారు. పవన్ తన వద్దకు వస్తారనిచంద్రబాబు ఇప్పటికీ నమ్ముతున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఇద్దరు పవన్,చంద్రబాబు కలయిక కసం తీవ్రప్రయత్నాలుచేస్తున్నారని తెలిసింది. పవన్ ఇటీవల యూరప్ పర్యటించినప్పుడు కూడా టీడీపీ, జనసేన పొత్తులపై చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. అక్కడి నుంచివచ్చిన తర్వాతనే పవన్ తన స్వరం మార్చారని అంటున్నారు.

స్వరాలు మర్చారు….

ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాను, పవన్ కలిస్తే తప్పేంటి? అన్ని ప్రశ్నించి లీకులు వదిలారు. కానీ దీనిపై పవన్ స్పందన నామమాత్రంగానే ఉండటాన్ని కూడా గమనించదగ్గ విషయం. పవన్ కూడా కేసీఆర్, జగన్ లు చంద్రబాబుపై కక్ష సాధించడానికి కలిశారన్న పవన్ వ్యాఖ్యలు ఇందుకు అద్దం పట్టే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కు సన్నిహితంగా ఉండే వారు సయితం ఒంటరిపోటీకంటే కలసి వెళ్లడమే మేలని సూచిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో బలం లేకుండా శాసించే స్థాయికి ఎదగలేమని కొందరు పవన్ కు నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్ పై వత్తిడి పెరుగుతుందా?

కానీ చంద్రబాబుకు గత ఎన్నికల్లో మద్దతిచ్చి తప్పు చేశామని పదే పదే ఇటీవల పోరాట యాత్రల్లో చెప్పిన పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొందరు నేతలు పవన్ కు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కలసి వెళ్తే పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యం లభించడమే కాకుండా అధికారంలో కీలకంగా మారవచ్చని, ప్రస్తుత పరిస్థితుల్లో పోటీలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా కష్టమేనని కొందరు గట్టిగా పవన్ కు సూచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇటీవల పార్టీలో చేరి కీలకభూమిక పోషిస్తున్న ఓ నేత టీడీపీతో జట్టుకట్టాలని వత్తిడితెస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Tags:    

Similar News