ప‌వ‌న్‌ను వారే ఎందుకు న‌మ్మలేదు.. రీజ‌నేంటి…?

రాజకీయాల‌కు సామాజిక వ‌ర్గాల‌కు మ‌ధ్య ఉన్న, ఉంటున్న అనుబంధం గురించి ఎంత త‌క్కువ చెప్పుకొన్నా మంచిదే. వ‌ర్గాలు, సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఆధారంగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఈ క్రమంలోనే [more]

Update: 2019-07-10 02:00 GMT

రాజకీయాల‌కు సామాజిక వ‌ర్గాల‌కు మ‌ధ్య ఉన్న, ఉంటున్న అనుబంధం గురించి ఎంత త‌క్కువ చెప్పుకొన్నా మంచిదే. వ‌ర్గాలు, సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఆధారంగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఈ క్రమంలోనే క‌మ్మ సామాజిక వ‌ర్గం టీడీపీకి జై కొడుతుండ‌గా.. రెడ్డి సామాజిక వ‌ర్గం మొత్తంగా జ‌గ‌న్‌కు జై అంటోంది. ఇక‌, మిగిలిన మూడో వ‌ర్గం కాపులు ఎవ‌రికి జై కొట్టా లి? అనే ప్రశ్న ఎప్పటిక‌ప్పుడు తెర‌మీదికి వ‌స్తోంది. ఈ క్రమంలోనే 2009లో ప్రజారాజ్యం పార్టీ వ‌చ్చిన‌ప్పుడు కాపులు అంద‌రూ ఆ పార్టీకి జై కొట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్ వైపు ఎందుకు చూడలేదన్నది చర్చగా మారింది.

ఆ నిర్ణయంతోనే….

అయితే, ఆశించిన మేర‌కు స‌క్సెస్ కాలేక పోవ‌డంతో పార్టీని నేరుగా కాంగ్రెస్‌లో విలీనం చేయ‌క త‌ప్పని ప‌రిస్థితి ఏర్పడింది. ఇక‌, ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన పార్టీ కాపుల‌కు అండ‌గా ఉంటుంద‌ని, ఈ సామాజి క వ‌ర్గానికి కూడా ఓ బ‌ల‌మైన పార్టీ దొరికింద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, ఇక్కడే ప‌వ‌న్ విష‌యంలో ట్విస్ట్ వ‌చ్చింది. మిగిలిన రాజ‌కీయ పార్టీలు.. ఆయా సామాజిక వ‌ర్గాల‌ను దూరం చేసుకోలేదు.

పట్టించుకోక పోవడంతో….

ముఖ్యంగా ఆయా పార్టీల అధినేత‌లు.. త‌మ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారిని.. ఎక్కడా దూరం చేసుకోలేదు. కానీ, పవన్ కల్యాణ్ విష‌యానికి వ‌స్తే.. తాను స్వయంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అయి ఉండి.. అదే సామాజిక వ‌ర్గం త‌మ‌కంటూ.. బ‌ల‌మైన పొలిటిక‌ల్ వేదిక కావాల‌ని కోరుతున్నా.. ఆయ‌న ప‌ట్టించుకోలేదు. త‌న‌కు కులం, మతం, జాతి అంటూ ఏమీ లేద‌ని, అంద‌రూ ఒక్కటేన‌ని సూక్తులు వ‌ల్లించాడు ప‌వ‌న్‌. దీంతో త‌న సొంత సామాజిక వ‌ర్గాన్ని ఆయ‌న చేజేతులా దూరం చేసుకున్నట్టే అయింద‌ని అప్పట్లోనే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, తాజాగా 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపులకు ప్రత్యామ్నాయ పార్టీ అంటూ ఏదీ క‌నిపించ‌కుండా పోయింది. త‌మ రిజ‌ర్వేష‌న్‌కు సంబంధించి చంద్రబాబు ఇచ్చిన హామీ నిల‌బెట్టుకోలేక పోయారు.

స్పందించకపోవడంతో….

ఇక‌, జ‌గ‌న్ ఇచ్చేది లేద‌ని, ఆ స‌మ‌స్య కేంద్రం కోర్టులో ఉంద‌ని తెగేసి చెప్పారు. ఇక‌, మిగిలిన మూడో ప‌క్షం పవన్ కల్యాణ్. త‌న సొంత సామాజిక వ‌ర్గం ఎదుర్కొంటున్న స‌మ‌స్యపై ప‌వ‌న్ నోరు తెరిచి స్పందించ‌లేక పోయారు. దీంతో కాపు సామాజిక వ‌ర్గం మొత్తం కూడా ప‌వ‌న్‌ను ఓన్ చేసుకోలేక పోయింది. ఇప్పుడు ఇదే విష‌యాన్ని కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప్ర‌స్థావించారు. మొత్తానికి పార్టీ పునాదుల‌ను ప‌టిష్టం చేయ‌డంలో ప‌వ‌న్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు!

Tags:    

Similar News