పవన్ మరో పెద్ద తప్పు చేస్తున్నారా?

స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే ఈ పోరులో దెబ్బతిన్నా, కోలుకున్నా అది జనసేన, బీజేపీలకే సాధ్యమవుతుంది. గత శాసనసభ [more]

Update: 2020-03-15 09:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే ఈ పోరులో దెబ్బతిన్నా, కోలుకున్నా అది జనసేన, బీజేపీలకే సాధ్యమవుతుంది. గత శాసనసభ ఎన్నికలలో జనసేన, బీజేపీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. జనసేన పార్టీ చచ్చీ చెడీ ఒక్క అసెంబ్లీ స్థానం గెలిస్తే, బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఆ ఎన్నికలలో విడివిడిగా పోటీ చేశారు. ఇప్పుడు రెండు పార్టీలు పొత్తులతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.

బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేకున్నా….

ప్రధానంగా ఈ ఎన్నికల్లో విజయాలేమీ నమోదు చేయకపోయినా బీజేపీకి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఏపీలో పెద్దగా చోటు లేదు. అందుకే పెద్దగా బీజేపీ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదనే చెప్పాలి. కానీ పవన్ కల్యాణ్ పార్టీకి అలా కాదు. ఏపీలో నిలదొక్కుకోవాలనుకుంటున్న పార్టీ అది. ఈ ఎన్నికల్లో కొద్దో గొప్పో ప్రభావం చూపితేనే పవన్ కల్యాణ్ పార్టీపై జనంలోకాని, క్యాడర్ లోకాని నమ్మకం ఏర్పడుతుంది.

ఎలా రిసీవ్ చేసుకుంటారో?

బీజేపీ, జనసేన పొత్తును ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాగా, మరొకటి పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ ఉన్న జనసేన పార్టీ. పవన్ కల్యాణ్ స్టార్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. ఇప్పటికీ ఆయనకు బలమైన అభిమానులతో పాటు సామాజికవర్గం కూడా అండగా ఉంది. రెండు పార్టీలు పొత్తుతో తొలిసారి బరిలోకి దిగుతుండటంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఆ ప్రభావం పవన్ పార్టీపై….

రెండు పార్టీలూ కలసి అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. రెండు పార్టీలకూ క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం బలహీనతగానే చెప్పుకోవాలి. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను సమన్వయకర్తలకే అప్పగించారు. రాష్ట్రానికి బీజేపీ ఎటువంటి సాయం అందించకపోవడతో ప్రజలు అటు వైపు చూసే అవకాశం లేదు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న పవన్ కల్యాణ్ పార్టీపై కూడా ఈ ప్రభావం పడక మానదు. ఈ ఎన్నికల్లో చివరకు నష్టపోయేది బీజేపీ కంటే పవన్ కల్యాణ్ అనేది సుస్పష్టం.

Tags:    

Similar News