రాజకీయాల ట్రెండ్ మారుస్తున్న పవన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో స్టయిల్ పూర్తిగా వేరు. ఆయన వ్యాఖ్యలు, కానీ చర్యలు కానీ సొంత పార్టీ వారినే విస్మయ పరుస్తూ ఉంటాయి. తన [more]

Update: 2020-07-04 11:00 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో స్టయిల్ పూర్తిగా వేరు. ఆయన వ్యాఖ్యలు, కానీ చర్యలు కానీ సొంత పార్టీ వారినే విస్మయ పరుస్తూ ఉంటాయి. తన మనసులో భావాలు దాచుకోకుండా షేర్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ నైజం. అందుకే ఆయన తానో పార్టీ అధినేతగా కాకుండా సామాన్యుడి మనోభావాలకు అద్దం పట్టేలా స్పందిస్తూ ఉంటారు. తాజాగా వైసిపి సర్కార్ అంబులెన్స్ ల ఏర్పాటు, వైరస్ టెస్ట్ లు అత్యధికంగా చేయడం పై పవన్ ట్విట్టర్ లో ప్రశంసించడానికి ఇది కూడా ఒక రీజన్ అంటున్నారు విశ్లేషకులు.

అంతర్జాతీయంగా ప్రశంసలు రావడంతో …

జగన్ సర్కార్ వైద్య రంగానికి వైరస్ సమయంలో ఇస్తున్న ప్రాధాన్యత కు దేశీయ మీడియా నే కాదు అంతర్జాతీయంగా కూడా అభినందనల వెల్లువ అందుకుంటుంది. ఒకేసారి వెయ్యి కి పైగా అంబులెన్స్ లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం చర్చనీయాంశం అయ్యింది. దాంతో పవన్ కళ్యాణ్ సైతం అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వైరస్ కట్టడి పరిశీలిస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. అంతే కాదు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక వైద్య కళాశాల కు జగన్ సర్కార్ రెడీ కావడం కూడా అందరి ప్రశంసలు అందుకుంటుంది.

ఉప్పు నిప్పుగా చాలా కాలంగా …

రాజకీయాలు సిద్ధాంత పరమైన పోరాటం ఉండాలి. కానీ నేటి ఆధునిక రాజకీయాలు పూర్తి భిన్నంగా నడుస్తున్నాయి. ప్రత్యర్ధులు మంచి చేసినా అది చెడు గా ప్రచారం చేసే పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. అధికారపక్షం ఎన్ని మంచి పనులు చేసినా ఒక్కరు ప్రశంసించారు. పరనింద ఆత్మస్తుతి గా ఏ పార్టీకి ఆ పార్టీ భజన సాగిస్తాయి. చాలాకాలంగా జనసేన – వైసిపి ఉప్పు నిప్పుగానే ఉంటున్నాయి. ఇదే రీతిలో తెలుగుదేశం తో కూడా వైసిపి కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సర్కార్ మంచి చేసినా వైసిపి చెడు గానే ప్రచారం చేసేది. అదే రీతి ఇప్పుడు జగన్ సర్కార్ ఏమి చేసినా టిడిపి సైతం ఇదే పంథా లో వెళుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాత ట్రెండ్ ను తన తాజా ట్వీట్ తో చెరిపేసినట్లు అయ్యింది. అయితే ఈ మంచి సంప్రదాయం ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.

Tags:    

Similar News