లాంగ్ మార్చ్ కాన్సెప్ట్ అదే

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. అస‌లు రాజ‌కీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శ‌త్రువులు కానీ ఉండ‌రనేది వాస్తవం. ఇప్పుడు ఈ విష‌యంపై చ‌ర్చ ఎందుకు జ‌రుగుతోందంటే.. తాజాగా [more]

Update: 2019-11-07 11:00 GMT

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. అస‌లు రాజ‌కీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శ‌త్రువులు కానీ ఉండ‌రనేది వాస్తవం. ఇప్పుడు ఈ విష‌యంపై చ‌ర్చ ఎందుకు జ‌రుగుతోందంటే.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ విశాఖ వేదిక‌గా నిర్వహించిన లాంగ్ మార్చ్‌లో ఆయ‌న చేసిన వ్యాఖ్యల కార‌ణంగానే..! రాష్ట్రంలో ఇసుక కొర‌త కార‌ణంగా భ‌వ‌న నిర్మాణ రంగంపై ఆధార‌ప‌డిన కార్మికులకుప‌నులు లేకుండా పోవ‌డం, వారు ఆత్మహ‌త్యల కు పాల్పడ‌డం వంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌వ‌న్ కల్యాణ్ ప్రస్తుత జ‌గ‌న్ ప్రభుత్వంపై విరుచుకుప‌డ్డారు. ఇసుక‌ను ప్రజ‌ల‌కు అందించే ఏర్పాట్లు చేయాల‌ని డెడ్‌లైన్ కూడా విధించాడు.

మోదీకి చెప్తానంటూ….

అదే స‌మ‌యంలో రాష్ట్రంలో ప‌రిస్థితి చ‌క్కదిద్దక‌పోతే.. ఈ విష‌యాన్ని కేంద్రంలోని పెద్దల‌కు కూడా వివ‌రిస్తాన‌ని చెప్పారు. ప్రధాని న‌రేంద్ర మోదీ స‌హా బీజేపీ సార‌ధి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ తాను భేటీ అయి రాష్ట్రంపై ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పడం ఇప్పుడు చ‌ర్చకు వ‌స్తున్న విష‌యం. ప‌వ‌న్ వ్యాఖ్యల‌ను బ‌ట్టి.. బీజేపీ అధిష్టానం ప‌వ‌న్‌కు రెడ్ కార్పెట్ ప‌రిచే ఉంచిందా ? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. 2014 ఎన్నిక‌ల సమయంలో తాను పోటీ చేయ‌క‌పోయినా.. బీజేపీకి మ‌ద్దతిచ్చారు. ప్రధాని అభ్యర్థిగా మోదీతో వేదిక‌లు పంచుకున్నారు. ఆయ‌న‌తో క‌లిసి తిరుప‌తిలో ప్రసంగాలు కూడా చేశారు.

కొన్నాళ్ల గ్యాప్ తర్వాత…..

ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. దీంతో బీజేపీ పెద్దల‌తో ప‌వ‌న్ కల్యాణ్ కు మంచి సంబంధాలే ఏర్పడ్డాయి. ఇక‌, ఆ త‌ర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా విష‌యంలో కేంద్రంలోని మోదీ స‌హా బీజేపీ పెద్దల‌తో ప‌వ‌న్ కల్యాణ్ విబేధించారు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ చోటు చేసుకుంది. అయితే.. ఇటీవల జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్‌ కల్యాణ్ తో క‌లిసి తిరిగేందుకు బీజేపీ ఉవ్విళ్లూరింది. ఆయ‌న పార్టీని బీజేపీలో విలీనం చేయాల‌ని కూడా ప్రతిపాదించింది. అయితే, దీనికి ప‌వ‌న్ కల్యాణ్ విముఖ‌త వ్యక్తం చేశారు. ఆయ‌న విలీనం చేసి ఉంటే.. రాజ్యస‌భ స‌భ్యత్వం ఇచ్చి ఉండేవార‌నే టాక్ వినిపించింది.

చిరుపైన కూడా…..

క‌ట్ చేస్తే.. ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ-ప‌వ‌న్‌ కల్యాణ్ ల మ‌ధ్య సంబంధాలు ప‌రోక్షంగా మెరుగ‌య్యాయి. కాపు వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకొనే ప్రయ‌త్నంలో ఉన్న బీజేపీ ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్‌ కల్యాణ్ ను ద‌గ్గర చేయ‌డం ద్వారా త‌మ వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని భావించింది. అటు ప‌వ‌న్ కల్యాణ్ అన్న కేంద్ర మాజీ మంత్రి చిరుపై కూడా దృష్టి పెట్టింది. ఇక‌, ఇప్పుడు తాజాగా నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు బీజేపీ పెద్దల‌ను ప‌వ‌న్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి మ‌రీ ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. అయితే, బీజేపీ మ‌ద్దతు ప‌లికినా. నాయ‌కులు ఎవ‌రూ మార్చ్‌కు ప్రత్యక్షంగా హాజ‌రుకాలేదు. అయిన‌ప్పటికీ.. ప‌వ‌న్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల‌ను బ‌ట్టి.. ఆయ‌న‌కు బీజేపీ పెద్దలు ట‌చ్‌లో ఉన్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. లేకపోతే.. జ‌గ‌న్‌ను బెదిరించేందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారా? అనే కోణంలోనూ చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రో రెండు మాసాలు జ‌రిగితే త‌ప్ప.. దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు

Tags:    

Similar News