పీడకలకు ఎండ్ కార్డ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన దానికి ఇంకా కారణాలు తవ్వుకుంటూనే పోతున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ ముఖ్య నేతల వరకు [more]

Update: 2020-02-17 06:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన దానికి ఇంకా కారణాలు తవ్వుకుంటూనే పోతున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ ముఖ్య నేతల వరకు దీనిపై వివరణ ఇవ్వడమే ఆయనకు సరిపోతుంది. ఓటమి చెందిన వెంటనే దాని నుంచి కోలుకోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే తనకు పట్టిందని చెప్పిన పవన్ అక్కడితో ఆ అంశం వదిలిపెట్టేశారనే అంతా అనుకున్నారు.

ప్రతి సమావేశంలోనూ….

కానీ కట్ చేస్తే ఆయన ఈ ఓటమిని పదేపదే తలుచుకుంటూ పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తూనే వున్నారని ఆయన తరచూ చేస్తున్న వ్యాఖ్యలు చెప్పక చెబుతున్నాయి. ఆ పీడకల పవన్ ను ఇంకా వెంటాడుతూనే ఉందని దీంతో స్పష్టం అయిపోతుంది. అందుకే ప్రతి సమావేశంలోనూ ఆయన భీమవరం, గాజువాక ఓటముల గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. తన సభలకు హాజరయ్యే కార్యకర్తలు ఓటింగ్ లో పాల్గొంటే గెలిచే వాడినని అనేకసార్లు చెప్పుకొచ్చారు.

తాడేపల్లిగూడెం అయితే …

జనసేనాని పవన్ కళ్యాణ్ అసలు రెండు చోట్ల పోటీ చేద్దామని భావించలేదట. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడం పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునే సమయం చిక్కకపోవడం తన ఓటమికి దారితీసిన కారణాల్లో ఒకటిగా స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పుకొస్తున్నారు. వీటితో పాటు పవన్ వెనుక ఉండి అన్ని చక్కబెట్టేవారు లేకపోవడం కూడా మైనస్ గానే జనసేనాని అంటున్నారు. ఇది కాకుండా రెండు చోట్ల పోటీ చేయడం కరెక్ట్ కాదని కూడా ఆయన లెక్కేసుకున్నారు. గాజువాక, భీమవరం లలో పోటీ చేయకుండా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే గెలిచి ఉండేవాడినని కూడా వాపోతున్నారు పవన్. దాంతో వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ‌్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు ముందుగానే అభిమానులకు ఇచ్చేశారు.

Tags:    

Similar News