పులుసు కారిపోతుందా?

రాజ‌కీయాల్లో తాను వాడుకోవ‌డం, తాను వాడ‌బ‌డ‌డం అనే రెండు సెగ్మెంట్లు ఉంటాయి. వీటిలో చాలా మంది నాయ‌కులు ఇత‌రుల టాలెంట్‌ను వాడుకుని తాము నిల‌బ‌డిన ప‌రిస్తితి క‌నిపిస్తుంది. [more]

Update: 2020-02-18 06:30 GMT

రాజ‌కీయాల్లో తాను వాడుకోవ‌డం, తాను వాడ‌బ‌డ‌డం అనే రెండు సెగ్మెంట్లు ఉంటాయి. వీటిలో చాలా మంది నాయ‌కులు ఇత‌రుల టాలెంట్‌ను వాడుకుని తాము నిల‌బ‌డిన ప‌రిస్తితి క‌నిపిస్తుంది. 2014 ఎన్నిక‌ల్లో ఏపీ ఇలాంటి ప‌రిస్తితినే చూసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, న‌రేంద్ర మోడీల ప్రచారంతో చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చారు. అంటే, వారిద్దరినీ వాడుకుని అధికారం చేప‌ట్టారు. ఇక‌, ఆ త‌ర్వాత గత ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రి అండ‌దండ‌లూ లేకుండానే బాబు పోటీ చేయ‌డం ఓడిపోవ‌డం తెలిసిందే.

పోయి..పోయి….

అదే స‌మ‌యంలో ప‌వ‌న్ కల్యాణ్ ఎవ‌రినీ వాడుకోకుండా తాను ఒంట‌రిగానే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఏదో క‌మ్యూనిస్టుల‌ను అడ్డు పెట్టుకున్నా ఓడిపోవ‌డం తెలిసిందే. అంటే గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌రిశీలిస్తే ప‌వ‌న్ కల్యాణ్ భారీ ఎత్తున రాజ‌కీయాల్లో వాడ‌బ‌డ్డాడు. అనే విష‌యం స్పష్టంగా తెలుస్తోంది. పోనీ ఆ త‌ర్వాత అయినా ఆయ‌న ఒంట‌రిగా నిల‌బ‌డే ప్రయ‌త్నాలు ఏమైనా చేశాడా? అనే ప్రశ్నకు లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పైగా పోయి పోయి బీజేపీతో చేతులు క‌లిపాడు.

బీజేపీ చేతిలో….

వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీ చేసేందుకు కూడా ప‌వ‌న్ కల్యాణ్ రెడీ అయ్యారు. అయితే, ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ వాడ‌బ‌డుతున్నాడ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి కొన్ని ద‌శాబ్దాల కింద‌టే 1983లో ఏర్పడిన బీజేపీకి ఇప్పుడు ప‌వ‌న్‌తో అవ‌స‌రం ఏంటి? ఆయ‌న‌కు మేలు చేసేందుకు బీజేపీ క‌లిసిందా? లేక ప‌వ‌న్ త‌న‌కు తాను మేలు చేసుకునేందుకు క‌లిశాడా? అంటే ప‌ర‌స్పరం మేళ్లకోసం క‌లిశార‌ని అంటున్నారు. కానీ, వాస్తవ విష‌యాన్ని ప‌రిశీలిస్తే ప‌వ‌న్‌ అండ‌తో బీజేపీ పుంజుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పవన్ మాత్రం……

బీజేపీకి ఉన్నపాటి అండ ఏమిటో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో స్పష్టంగా తెలిసిపోయింద‌ని, దీంతో పోల్చుకుంటే జ‌న‌సేన క‌నీసం ఒక సీటైనా గెలుచుకుంద‌ని అంటున్నారు. సో… దీనిని బ‌ట్టి రాష్ట్రంలో బీజేపీ ఎదుగుద‌ల‌కు ప్రత్యక్షంగాను, ప‌రోక్షంగాను ప‌వ‌న్ కల్యాణ‌్ ఉప‌యోగ‌ప‌డే ప‌రిస్థితి ఉంటుంద‌ని, అంతే త‌ప్ప ప‌వ‌న్‌కు బీజేపీ ఉప‌యోగం అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. దీనిని బ‌ట్టి ఎలా చూసుకున్నా ప‌వ‌న్ పార్టీ పెట్టుకున్న నాటి నుంచి నేటి వ‌ర‌కు పొలిటిక‌ల్ పులుసు మాదిరిగా ఏదో ఒక పార్టీకి ఉప‌యోగ‌ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఈ విష‌యాన్ని ప‌వ‌న్ కల్యాణ్ గ్రహించారో లేదో ? చూడాలి.

Tags:    

Similar News