బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళినట్లేనా?

పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటుడు. రాజకీయాల్లో కూడా ఆయన నటన మాత్రమే చేస్తార‌ని, వేరే వారు దర్శకత్వం నెరుపుతారని పదే పదే వైసీపీ నేతలు అంటూంటారు. [more]

Update: 2020-01-28 12:30 GMT

పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటుడు. రాజకీయాల్లో కూడా ఆయన నటన మాత్రమే చేస్తార‌ని, వేరే వారు దర్శకత్వం నెరుపుతారని పదే పదే వైసీపీ నేతలు అంటూంటారు. బాబు డైరెక్షన్లో పవన్ పనిచేస్తున్నాడంటూ ఇంతకాలం విమర్శలు చేసిన ఫ్యాన్ పార్టీ నేతలకు ఝలక్ ఇస్తూ పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఎవరి పార్టీ సిధ్ధాంతాలు వారికి ఉంటూనే ఉమ్మడి కార్యాచరణతో కలసి పనిచేయడానికి అన్న మాట. అయితే సీన్ చూస్తే అలా అనిపించడంలేదు. బీజేపీ సిధ్ధాంతాలను పవన్ వల్లెవేయడేమే అందుకు ఉదాహరణ అంటున్నారు.

అమరావతిని వదిలి….

రాజధాని అమరావతి కదిలిస్తే ఊరుకోమని, వైసీపీ సర్కార్ అంతు తేలుస్తామని పవన్ కల్యాణ‌్ గర్జించి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ మీడియా ముందుకు వచ్చి అచ్చం బీజేపీ వాయిస్ వినిపించారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని పవన్ కల్యాణ్ కి హస్తినకు వెళ్ళాక కానీ బోధపడినట్లు లేదు. అయితే రాజధాని విషయాన్ని ఇక్కడితో వదిలేయమని, బీజేపీతో కలసి ఫిబ్రవరి 2వ తేదీని లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ముహూర్తం కూడా ప్రకటించారు. తీరా ఏమైందో తెలియదు కానీ లాంగ్ మార్చ్ రద్దు అయింది. పవన్ కల్యాణ‌్ నోటి వెంట అమరావతి మాట ఇపుడు రావడమే లేదు.

సీఏఏ గురించి….

ఇక పవన్ కల్యాణ్ ఇపుడు మరో అంశాన్ని తలెకెత్తుకున్నారు. ఆ అంశం ఆయనది కాదు, ఆ తలనొప్పి ఆయనకు లేదు. కానీ సీఏఏ అంశాన్ని జనంలో ప్రచారం చేస్తామంటూ పవన్ మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన కార్యకర్తల మీటింగులో మాట్లాడుతూంటే విస్తుపోవడం క్యాడర్ వంతు అయింది. సీఏఏ గురిని వారికి కూడా తెలియదు. తెలిసినా వారికి దాని అవసరం ఇపుడు లేదు. బీజేపీ ఈ అంశంపైన దేశవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటోంది. కక్కలేక మింగలేక అన్నట్లుగా కమలదళం సతమతమవుతోంది. ఎంతో స్టాంగ్ ఫౌండేషన్, ప్రచారంలో దూకుడు ఉన్న బీజేపీకే సాధ్యపడని సీఏఏ కధని ఇపుడు పవన్ కల్యాణ్ టేకప్ చేయడంతో పార్టీ శ్రేణులు నివ్వెరపోతున్నాయి.

అలా డిసైడ్ అయ్యారా…?

ఇక ఏపీలో సెగ పుట్టించే రాజకీయం సాగుతోంది. ఓ వైపు శాసనమండలి రద్ద్దు చేస్తూ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో వైపు అమరావతి కధ అలాగే ఉంది. ఈ నేపధ్యంలో పవన్ కల్యాణ్ ఆ వూసునే తలవకుండా సీఏఏ పై అర్జంట్ గా జనాల్లో చైతన్యం కలిగించాలని చెప్పడమే జనసైనికులకు పాలుపోవడంలేదుట. ఇది ఫక్తు బీజేపీ అజెండా అని, దాన్ని పవన్ కల్యాణ్ తలకెత్తుకుని జనాల్లోకి వెళ్తే మతతత్వ ముద్ర తమ పార్టీపైన కూడా పడుతుందని జనసేనలో ఉన్న వారు మదనపడుతున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ చెప్పిందే చేయాలని డిసైడ్ అయిపోయారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి పొత్తులు ఉంటేనే బీజేపీ గొంతుక అయిన పవన్ కల్యాణ్ రేపు పార్టీని విలీనం చేస్తే తమ ఉనికికి కాపాడగలరా అన్న పెద్ద డౌట్లే జన సైనికులల్లో వస్తున్నాయట.

Tags:    

Similar News