ఒక్క ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు

ప‌వ‌న్ కల్యాణ్ ఒంట‌రిగానే ఉండి ఉంటే బాగుండేది గురూ. ప‌వ‌న్ బీజేపీతో జ‌ట్టుక‌ట్టి మ‌ళ్లీ త‌ప్పుచేశాడేమో అని పిస్తోంది.. జ‌న‌సేన‌-బీజేపీల పొత్తుపై ఇప్పుడు నెటిజ‌న్లు వ్యక్తం చేస్తున్న [more]

Update: 2020-01-22 14:30 GMT

ప‌వ‌న్ కల్యాణ్ ఒంట‌రిగానే ఉండి ఉంటే బాగుండేది గురూ. ప‌వ‌న్ బీజేపీతో జ‌ట్టుక‌ట్టి మ‌ళ్లీ త‌ప్పుచేశాడేమో అని పిస్తోంది.. జ‌న‌సేన‌-బీజేపీల పొత్తుపై ఇప్పుడు నెటిజ‌న్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇవే. రాజ‌కీయ ప‌రి ణామాల‌పై ఎప్పటిక‌ప్పుడు స్పందిస్తున్న చాలా మంది నెటిజ‌న్లు చెబుతున్న మాట‌లు కూడా ఇవే కావడం గ‌మ‌నార్హం. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. 2014లో బీజేపీ, టీడీపీల‌కు మ‌ద్దతిచ్చారు. ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల‌కూ ఆయ‌న ప్రచారం చేశారు. అయితే, 2019 ఎన్నిక‌ల నాటికి ఈ రెండు పార్టీల‌తోనూ విభేదించారు. క‌మ్యూనిస్టుల‌తో జ‌ట్టుక‌ట్టి సొంతంగానే బ‌రిలోకిదిగారు. అయినా కూడా జ‌న‌సేన స‌త్తా చాట‌లేక పోయింది.

పొత్తు లేకుండానే….

దీంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నిక‌ల ముందు మ‌ళ్లీ బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు. అయితే, వాస్తవానికి రాజ‌కీయాల్లో కావాల్సింది వ్యూహం. పొత్తు రాజ‌కీయాలైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తేనే ప్రజ‌లు హ‌ర్షిస్తార‌నేది వాస్తవం. అయితే, ఈ విష‌యంలో ప‌వ‌న్ వ్యూహాలు లేకుండానే ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఈ విష‌యంపైనే నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. వీరు వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. జ‌గ‌న్ ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోకుండానే 2012 ఉప ఎన్నిక‌ల్లో పార్టీ పెట్టిన కొద్ది రోజుల‌కే 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నాడు బ‌లంగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీని ఢీ కొట్టి మ‌రీ విజ‌యం సాధించారు.

పోరాటం చేస్తేనే….

ఇక 2014లో 67 స్థానాల‌ను, 2019లో 151 స్థానాల‌ను పొందిన తీరును గ‌మ‌నించి ఉంటే ప‌వ‌న్‌ కల్యాణ్ కు బాగుండేద‌ని అంటున్నారు. ప్రజ‌ల సింప‌తీని సంపాదిస్తే పొత్తుల‌తో సంబంధం లేకుండానే ఏ పార్టీ అయినా అధికారంలోకి వ‌స్తుంద‌ని సూచిస్తున్నారు. జ‌గ‌న్ ఓడిపోయినా ఐదేళ్ల పాటు ప్రజ‌ల్లోనే ఉండ‌డం.. సుదీర్ఘమైన పాద‌యాత్ర చేయ‌డం.. చంద్రబాబుకు ధీటుగా తాను నాయ‌కుడిని అన్న న‌మ్మకాన్ని ప్రజ‌ల్లో క‌లిగించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. 2014లో చంద్రబాబు కూడా అనుభ‌వం అనే సింప‌తీని ప్లే చేశారు. ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. 2019లో జ‌గ‌న్ పోరాటాన్ని చూసి ప్రజ‌లు ఫీలై ఓట్లేశారు. ఇప్పుడు పవ‌న్ కల్యాణ్ కూడా ఒంట‌రిగానే నిల‌బ‌డి అటు ప్రతిప‌క్షం, ఇటు అధికార ప‌క్షాల‌పై పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తే.. బాగుండేద‌నే అభిప్రాయం సర్వత్రావినిపిస్తోంది.

అవకాశం ఉండి కూడా….

పోయి పోయి.. పాచిపోయిన ల‌డ్డూల‌ను ప్రసాదించిన బీజేపీతో ఆయ‌న పొత్తు పెట్టుకోవ‌డాన్ని, ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రం అన్ని విధాలా ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొన‌డానికి కార‌ణ‌మైన బీజేపీతో చేతులు క‌ల‌ప‌డాన్ని మెజారిటీ నెటిజ‌న్లు వ్యతిరేకిస్తున్నారు. ఏపీలో స‌గ‌టు ఓట‌రుకు కూడా బీజేపీ అంటే చికాకు పుట్టేసింది. ఇప్పుడు అలాంటి పార్టీతో ప‌వ‌న్ కల్యాణ్ చేతులు క‌ల‌ప‌డాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలా కాకుండా ఒంట‌రిగా ఉంటూ త‌న ప‌నితాను చేసుకుని పోతే.. జ‌గ‌న్‌కు ప్రత్యామ్నాయ నాయ‌కుడిగా ప‌వ‌న్ ఎదిగి ఉండేవార‌నే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం ఆలోచించారో? అని స‌రిపెట్టుకుంటున్నారు.

Tags:    

Similar News