బెజవాడ భేటీ తర్వాత మార్పు?

బీజేపీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ స్వరం మారిందా? ఆయన తెలుగుదేశం పార్టీని కూడా ఇక టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. బెజవాడ భేటీతో [more]

Update: 2020-01-16 13:30 GMT

బీజేపీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ స్వరం మారిందా? ఆయన తెలుగుదేశం పార్టీని కూడా ఇక టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. బెజవాడ భేటీతో పవన్ లో వచ్చిన మార్పునకు కారణాలేంటన్న చర్చ జరుగుతోంది. గత కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ వైసీపీనే టార్గెట్ చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీనే పవన్ కల్యాణ్ తప్పు పట్టేవారు. జగన్ సీఎం ఎప్పటికీ కాలేరని కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

టీడీపీకి మద్దతిచ్చి….

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీని పన్నెత్తు మాట అనలేకపోయారు. దీంతో పవన్ కల్యాణ్ టీడీపీకి అనుకూలమని, చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటారన్న అభిప్రాయం బలంగా నెలకొంది. అయితే 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశారు. కర్ణాటక తరహాలో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చని భావించారు. కానీ పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.

వైసీపీనే టార్గెట్ చేసి….

అయితే ఎన్నికల తర్వాత వైసీపీని పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. చంద్రబాబు విషయంలో కొంత మెతకవైఖరినే అవలంబిస్తున్నారు. అమరావతి తరలింపు అంశంలోనూ టీడీపీ చేస్తున్న డిమాండ్ వైపు మొగ్గుచూపారు. తాజాగా బీజేపీ నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పంపారని వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఎట్టకేలకు బీజేపీ, జనసేన పార్టీలో బెజవాడలో భేటీ అయి కలసి పనిచేయాలని నిర్ణయించాయి.

భేటీ తర్వాత…..

ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కు బీజేపీ నేతలు విస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు తమకు ప్రధాన శత్రువని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అధికార వైసీపీ ఎంతో? చంద్రబాబు కూడా అంతేనని, ఆయన విషయంలో ఎలాంటి మెతకవైఖరిని అవలంబించబోమని కూడా బీజేపీ నేతలు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇది తమ స్టాండ్ అని బీజేపీ నేతలు స్పష్టం చేయడంతోనే భేటీ తర్వాత పవన్ కల్యాణ్ తన స్వరాన్ని మార్చారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతితో పాటు రాజధానికి అన్ని ఎకరాలు అవసరం లేదని తాను ఆనాడే చెప్పానని పవన్ కల్యాణ‌్ చెప్పడం విశేషం. వైసీపీని ఎంత విమర్శించారో? అంతే స్థాయిలో టీడీపీని కూడా దునుమాడటం పవన్ లో వచ్చిన మార్పునకు నిదర్శనమంటున్నారు. టీడీపీ స్కీం బీజేపీలో వర్క్ అవుట్ అవదని పవన్ కల్యాణ్ గ్రహించినట్లుంది.

Tags:    

Similar News