పాపం పవన్.. మోహన్ బాబు బెటరేమో

పవన్ కల్యాణ్ మూడు రోజులపాటు ఢిల్లీలో ఉన్నప్పటికీ పెద్దగా సానుకూలత లభించలేదు. పవన్ కల్యాణ‌్ ఇప్పటి వరకూ జేపీ నడ్డాను మాత్రమే కలిశారు. అలాగే ఏపీ రాష్ట్ర [more]

Update: 2020-01-13 13:30 GMT

పవన్ కల్యాణ్ మూడు రోజులపాటు ఢిల్లీలో ఉన్నప్పటికీ పెద్దగా సానుకూలత లభించలేదు. పవన్ కల్యాణ‌్ ఇప్పటి వరకూ జేపీ నడ్డాను మాత్రమే కలిశారు. అలాగే ఏపీ రాష్ట్ర ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ తో పాటు కేంద్ర మంత్రి మురళిథరన్ ను కూడా కలసినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు ఆర్ఎస్ఎస్ నేతలను రహస్యంగా పవన్ కల్యాణ్ కలిసినట్లు చెబుతున్నారు. అయితే టోటల్ గా పవన్ ఢిల్లీ పర్యటనను చూసుకుంటే కేవలం పార్టీ నేతలను కలవడానికే ఆయన పర్యటన పరిమితమయినట్లు అర్థమవుతోంది.

ఫోన్ రావడంతోనేనని…..

నిజానికి పవన్ కల్యాణ్ హటాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ నేతల నుంచి ఫోన్ రావడంతోనే పవన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారని జనసేన నేతలు చెప్పారు. కానీ అందులో వాస్తవం లేదని తేలింది. పవన్ కల్యాణ్ తనంతట తానుగానే ఢిల్లీ వెళ్లినట్లు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. రాజధాని రైతులతో భేటీ అయిన పవన్ కల్యాణ్ వారికి భరోసా ఇచ్చారు. తాను కేంద్రం పెద్దలతో మాట్లాడి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరతానని చెప్పారు.

మూడు రోజులున్నా…..

అందుకే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ముగించుకుని మరీ పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నప్పటికీ నడ్డా అపాయింట్ మెంట్ తప్ప మరెవరివీ పవన్ కల్యాణ్ కు లభించలేదు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవాలని పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జేపీ నడ్డాతో భేటీ కావడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని, నడ్డాకు నిర్ణయం తీసుకునే శక్తి లేదన్నది అందరూ అంగీకరించే విషయమే. అందుకే నడ్డాతో భేటీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నడ్డాను రోజుకు పదుల సంఖ్యలో అన్ని రాష్ట్రాల చిన్నా చితకా నేతలు కలుస్తూనే ఉంటారు.

మోహన్ బాబుకు ఇచ్చి…..

నిజానికి పవన్ కల్యాణ్ కు మోదీ, అమిత్ షాలు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పవన్ కల్యాణ్ సహకారంతో పార్టీని ఏపీలో బలోపేతం చేసుకునే వీలుంది. అయితే ఇటీవల మోహన్ బాబు కు కూడా నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. మోహన్ బాబు వైసీపీలో ఉండి ఏ పదవిలో లేకున్నా ఆయన మోదీని సులువుగా ఫ్యామిలీతో కలసి వచ్చారు. కానీ ఒక పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్ లభించకపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News