మళ్లీ వాయిదానేనా?

జనసేనకు మెగాస్టార్ చిరంజీవి కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిపై ఒకటి తలిస్తే చిరంజీవి దానికి విరుద్ధంగా స్పందించి సోదరుల [more]

Update: 2019-12-30 05:00 GMT

జనసేనకు మెగాస్టార్ చిరంజీవి కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిపై ఒకటి తలిస్తే చిరంజీవి దానికి విరుద్ధంగా స్పందించి సోదరుల ఉద్యమం పై నీళ్ళు చల్లేశారు. ఆ దెబ్బకే అమరావతి లో రాజధాని వుండాలంటూ తొలుత ఉద్యమించిన జనసేన కొంత గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇవ్వలిసిన పరిస్థితి ఏర్పడింది. క్రిస్మస్ పండగను తన భార్య పిల్లలతో విదేశాల్లో గడిపి పవన్ ఇండియా చేరుకున్నాక పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నేడు నిర్వహిస్తున్నా జనసేన పోరాటానికి పట్టు లేకుండా పోయిందనే టాక్ వినవస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ అడుగులు ఎటువైపు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఉత్తరాంధ్ర, సీమలో వీక్ అవుతారా …?

ప్రస్తుతం జనసేన స్టాండ్ రాజధాని అమరావతిలోనే ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప అధికార వికేంద్రీకరణ వల్ల ప్రయోజనం లేదన్నది అజండా గా పెట్టుకుంది. ఆ పార్టీ నాయకుడు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనరనారాయణ ఇదే అభిప్రాయాన్ని ఇటీవల మరోసారి స్పష్టం చేశారు కూడా. అదే నిర్ణయంతో జనసేన ముందుకు వెళితే ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం తరచూ చెప్పే పవన్ ఇకపై దానిపై మాట్లాడినప్పుడల్లా అధికారపార్టీ ఆయనపై విరుచుకుపడే పరిస్థితి ఉంటుంది.

బీజేపీ వైఖరినే…..

గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన పవన్, లక్ష్మీనారాయణ లకు ఆ ప్రాంతంలో వ్యతిరేకత భవిష్యత్తులో గట్టిగానే ఉండొచ్చు. ఇక రాయలసీమలోను ఇబ్బందికర వాతావరణమే రావొచ్చు. అయితే అమరావతిలోనే రాజధాని వుండాలంటూ ఇప్పటికే ముందడుగు వేయడం వల్ల వెనక్కి సైతం వెళ్లలేని స్థితి లో జనసేన వుంది. ఈ నేపథ్యంలో బిజెపి వైఖరినే జనసేన ఫాలో అవ్వొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ప్రభుత్వం హై పవర్ కమిటీ ని నియమించి ఫైనల్ నిర్ణయం వాయిదా వేయడంతో అది వచ్చాకనే తమ నిర్ణయం అని పవన్ స్పష్టం చేసే అవకాశాలు కూడా వున్నాయి. మరి పవన్ గాలి ఎటు వీస్తుందో చూడాలి.

Tags:    

Similar News