వికెట్లను కాపాడుకోవడం ఎలా?

జనసేన కు ఇప్పట్లో కష్టాలు తీరేలా కనిపించడం లేదు. పార్టీ ఏర్పడిన నాటినుంచి మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం వరకు అనేక బాలారిష్టాలు పార్టీ ఎదుర్కొంటుంది. ఒక [more]

Update: 2019-12-15 11:00 GMT

జనసేన కు ఇప్పట్లో కష్టాలు తీరేలా కనిపించడం లేదు. పార్టీ ఏర్పడిన నాటినుంచి మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం వరకు అనేక బాలారిష్టాలు పార్టీ ఎదుర్కొంటుంది. ఒక పక్క అంతా తానై పార్టీని నడిపించే అధ్యక్షుడే రెండు చోట్ల ఓటమి చెందడమే ఆ పార్టీ పై నమ్మకాన్ని అందరిలో వమ్ము చేసింది. ఒక్కటి అంటే ఒక్క సీటే అనేక పొత్తులు పెట్టుకున్నా దక్కిన స్థానం. అది కూడా ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితి. ఆ పార్టీ ఏకైక సభ్యుడు రాపాక వరప్రసాద్ చీటికీ మాటికీ కస్సుబుస్సు జగన్ సూపర్ అంటూ చేసే కామెంట్ల తో డిఫెన్స్ లో పడాలిసి వస్తుంది. ఎన్నికలు పూర్తి అయ్యి ఫలితాలు రాకుండానే అనేక మంది పార్టీకి గుడ్ బై కొట్టి పక్క పార్టీల్లోకి దూకేయడం కొందరు ఏ పార్టీ లో చేరకుండా సైలెంట్ అయిపోవడం పవన్ కల్యాణ్ కు దెబ్బ మీద దెబ్బ తగిలేలా చేస్తూ వస్తుంది.

మూలకారకుడే బైబై …

రాజు రవితేజ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఎపి, తెలంగాణ లో ఆయనే హాట్ టాపిక్ అయ్యారు. పవన్ పార్టీ లో కీలక పాత్ర రాజు రవితేజ ది. ఆయన వల్లే పార్టీ పెట్టేందుకు ప్రేరణ పొందానని గతంలో పవన్ కల్యాణ‌్ వ్యాఖ్యానించడమే కాదు పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించి ఆయన ప్రాధాన్యాన్ని చెప్పక చెప్పారు. జనసేన రాజ్యాంగ రచనలో రాజు రవితేజ ప్రధాన భూమిక వహించారు కూడా. పవనిజం పుస్తకాన్ని సైతం రాజు రచించారు కూడా. అలాంటి కీలక వ్యక్తి జనసేన కు గుడ్ బై కొడుతూ కొడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో పవన్ కల్యాణ్ కి ఇప్పటి నాయకుడికి చాలా తేడా వచ్చిందని ఆయన వల్ల సమాజానికి ప్రమాదం, కులం, మతం కక్ష సాధింపు ధోరణి పెరిగిందంటూ లేఖ రాసి కలకలం సృష్ట్టించారు. ట్విటర్ వేదికగా రాజు చేసిన రాజీనామా దుమారమే రేపింది.

చెలరేగిన జనసైనికులు …

జనసేన సైనికులు సోషల్ మీడియా వేదికగా రాజు రవితేజ పై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ చెంత చేరేవరకు అనామకులుగా వున్న వారు ఆయన నీడను చేరి గుర్తింపు పొంది ద్రోహం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. టిడిపి, వైసిపి ప్రలోభాలకు గురయ్యే జనసేన ను వీడి కొందరు స్వార్ధ పరులు ఈవిధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు. ఈ వ్యవహారాన్ని జనసేన ఎలా సమర్ధించుకున్నా జనసేన లో కీలక నేతలు గా వున్న వారు కష్టకాలంలో అధినేతపై దుమ్మెత్తి పోస్తూ టాటా చెప్పేయడం ఆ పార్టీపై అరకొరగా జనంలో వున్న నమ్మకాన్ని మరింతగా దెబ్బతీస్తుంది. ఈ పరిణామాలను అనుభవం లేని జనసేనాని ఎలా ఎదుర్కొని నిలబడతారన్న చర్చ ఇప్పుడు గట్టిగానే నడుస్తుంది. చూడాలి పవన్ కల్యాణ్ ఇకపై ఎలాంటి వ్యూహంతో సాగుతారో.

Tags:    

Similar News