Pawan kalyan : డెడ్ లైన్ దగ్గర పడింది.. మరి కార్యాచరణ ఏమిటో?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాలకు డెడ్ లైన్ లను విధించడంలో దిట్ట. ఆయన గతంలోనూ అనేక మార్లు అల్టిమేటం ఇచ్చి అభాసుపాలయ్యారు. ఇప్పుడు పవన్ ఇచ్చిన [more]

Update: 2021-11-05 03:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాలకు డెడ్ లైన్ లను విధించడంలో దిట్ట. ఆయన గతంలోనూ అనేక మార్లు అల్టిమేటం ఇచ్చి అభాసుపాలయ్యారు. ఇప్పుడు పవన్ ఇచ్చిన గడువు కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది. రేపటి లోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆయన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు. వస్తుందన్న ఆశ కూడా లేదు.

అఖిలపక్షం….

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత నెల 31న విశాఖపట్నానికి వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు మద్దతు తెలిపిన ఆయన ఆవేశంగా అల్టిమేటం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో ఉద్యమించడానికి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇచ్చారు. ఈ నెల 6వ తేదీ అంటే రేపటితో ఈ డెడ్ లైన్ ముగియనుంది.

ప్రభుత్వం మాత్రం….

ప్రభుత్వం మాత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేదు. పవన్ ప్రకటన చేసిన వెంటనే వైసీపీ నేతల నుంచి వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనం. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము కూడా హాజరవుతామని భారతీయ జనతా పార్టీ కూడా ప్రకటించింది. అయినా వైసీపీ ప్రభుత్వం మాత్రం పవన్ కల్యాణ్ డెడ్ లైన్ ను పట్టించుకోలేదు. అసలు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు.

భారీ ప్రదర్శనకు….

దీంతో పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని భుజానికెత్తుకోవాలని భావిస్తున్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ ను నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. లాంగ్ మార్చ్ లో మిగిలిన రాజకీయ పక్షాలన్నింటిని కలుపుకుని ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేయాలని పవన్ కల్యాణ‌్ భావిస్తున్నారు. మొన్నటి సభ సక్సెస్ కావడంతో మరోసారి విశాఖ కేంద్రంగానే భారీ ప్రదర్శనకు పవన్ సిద్ధమవుతారని తెలుసోంది. ఈ మేరకు డెడ్ లైన్ ముగిసిన తర్వాత ఆయన నుంచి ప్రకటన వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News