Pawan : పవన్ ఛాలెంజ్ ని గాలిలో కలిపేశారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక సవాల్ విసిరారు. ప్రభుత్వం వారంరోజుల్లోగా స్పందించకుంటే తాను కార్యాచరణను ప్రకటిస్తానని సవాల్ విసిరారు. కానీ పవన్ కల్యాణ్ సవాల్ విసిరి [more]

Update: 2021-11-02 02:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక సవాల్ విసిరారు. ప్రభుత్వం వారంరోజుల్లోగా స్పందించకుంటే తాను కార్యాచరణను ప్రకటిస్తానని సవాల్ విసిరారు. కానీ పవన్ కల్యాణ్ సవాల్ విసిరి మూడు రోజులవుతున్నా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ ప్రభుత్వం నుంచి ఆశించడం కూడా అవివేకమే. పవన్ కల్యాణ్ ను వైసీపీ ప్రభుత్వం టీడీపీ మద్దతుగారుగానే చూస్తుంది. అందుకే పవన్ కల్యాణ్ సవాల్ … గాలిలో కలసి పోవాల్సిందే.

వారం రోజులు గడువు….

పవన్ కల్యాణ్ కు అన్నీ తెలుసు. జగన్ మొండితనం కూడా తెలుసు. ఇప్పుడున్నది టీడీపీ ప్రభుత్వం కాదన్నదీ ఎరుకే. అయినా సవాళ్లు విసురుతున్నారు. అది కూడా వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని ఒక అంశంపైన. మూడు రోజుల క్రితం విశాఖలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో అఖిలపక్షాన్ని పిలవకుంటే మామూలుగుండదని హెచ్చరించారు.

కార్మిక సంఘ నేతలను…

అయితే ప్రభుత్వం మాత్రం పవన్ కల్యాన్ సవాల్ ను అసలు పట్టించుకోవడం లేదు. అయితే దీనికి విరుగుడుగా ప్రభుత్వం కార్మిక సంఘాల నేతలను ఢిల్లీ తీసుకెళ్లి మోదీ, అమిత్ షాలను కలిపే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జగన్ గతంలోనే చెప్పారు. పవన్ కల్యాణ్ అఖిలపక్షం డిమాండ్ తర్వాత వైసీపీ నేతలు దీనిపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కోరి కార్మిక సంఘాల నేతలను ఢిల్లీకి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.

సవాల్ ను చూసీ చూడనట్లు…

అసలు ఈ సమస్యతో పవన్ కల్యాణ్ కు ఎలాంటి సంబంధం లేకుండా చేయాలన్నది వైసీపీ ఎత్తుగడగా ఉంది. పవన్ కల్యాణ్ కు సవాళ్లు విసరడం మామూలే. ఆయన అసలు సమస్యను వెనక్కు నెట్టి సవాళ్లను విసురుతుంటారన్న పేరుంది. గతంలోనూ ఇలాగే సవల్ విసిరి ప్రభుత్వం స్పందించలేదంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురుకానుంది. ప్రభుత్వం మాత్రం పవన్ కల్యాణ్ సవాల్ ను వినీ విననట్లుగా వదిలేసి, స్టీల్ ప్లాంట్ కార్మికులను మాత్రం ఢిల్లీ తీసుకెళ్లే యోచనలో ఉంది.

Tags:    

Similar News