జ‌న‌సేన‌కు అదే ప్లస్సయిందా..?

రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా.. సంచ‌ల‌న‌మే. ఏం జ‌రిగినా.. త‌మ‌కు ప్లస్ అయ్యేలా చూసుకోవ‌డం నేత‌ల‌కు కూడా కామ‌నే..! అయితే, దీనికి భిన్నంగా సంప్రదాయ రాజ‌కీయాలు చేస్తామంటూ.. రాజ‌కీయాల్లోకి [more]

Update: 2019-08-27 00:30 GMT

రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా.. సంచ‌ల‌న‌మే. ఏం జ‌రిగినా.. త‌మ‌కు ప్లస్ అయ్యేలా చూసుకోవ‌డం నేత‌ల‌కు కూడా కామ‌నే..! అయితే, దీనికి భిన్నంగా సంప్రదాయ రాజ‌కీయాలు చేస్తామంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.. ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ముఖ్యంగా నేటి రాజ‌కీయాల‌కు భిన్నంగా ఆయ‌న అడుగులు వేయాల‌ని భావించారు. ఈ క్రమంలోనే అవినీతి లేని ఎన్నిక‌ల‌కు వెళ్తున్నామంటూ ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో తాను ఎక్కడ రూపాయి కూడా పంచ‌కుండా ముందుకు సాగారు. ఎన్నిక‌ల్లో టికెట్ల పంపిణీ విష‌యంలోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆచితూచి వ్యవ‌హ‌రించారు. విద్యావంతుల‌కు, మేధావుల‌కు, అదేస‌మ‌యంలో రిజ‌ర్వ్‌డ్ వ‌ర్గాల‌కు కూడా కేటాయించారు.

రాపాక అరెస్ట్ వ్యవహారం…

అయితే, రాజ‌కీయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇది ప‌బ్లిక్ ప్లాట్ ఫాం కాబ‌ట్టి.. ప్రతి విష‌య‌మూ సంచ‌ల‌న‌మే. ఈ నేప‌థ్యంలోనే పార్టీల‌కు ప్రతి నిత్యం అగ్ని ప‌రీక్షే..! తాజాగా ఓ వారం కింద‌ట జ‌న‌సేన వ్యవ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఆ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, తూర్పుగో దావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాపాక వ‌ర్సెస్ పోలీసుల మ‌ధ్య తీవ్ర యుద్ధం సాగింది. పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేయ‌డం వీరిలో రాపాక అనుచ‌రుడు ఉండ‌డంతో ఆయ‌న‌ను విడిచి పెట్టాల‌ని కోర‌డం, ఇది పూర్తిగా రాజ‌కీయ రంగు పులుము కోవ‌డం.. పోలీసు స‌బ్ ఇన్ స్పెక్టర్ దీనిపై తీవ్రంగా స్పందించ‌డం వంటి ప‌రిణామాలు రాష్ట్రంలో రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపాయి.

జగన్ పై నేరుగా….

దీనికి కొన‌సాగింపుగా.. రాపాక ప్రసాద్ అరెస్టు కూడా సంచ‌ల‌నం రేపింది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అనుకున్న దానిక‌న్నా కూడా కొంచెం ఎక్కువ మోతాదులోనే స్పందించారు. జ‌గ‌న్ ప్రభుత్వంపై విరుచుకుప‌డ్డారు. త‌న పార్టీ ఎమ్మెల్యేను వైసీపీలోకి ఫిరాయించేలా చేయ‌డం వెనుక దాగి ఉన్న కుట్రగా దీనిని అభివ‌ర్ణించారు. ఇక‌, రాపాక కూడా పోలీసుల‌కు స్వచ్ఛందంగా లొంగిపోవ‌డం తోపాటు.. తాను ద‌ళితుడిని కాబ‌ట్టే.. త‌నను అరెస్టు చేశార‌ని.. త‌న‌ను టార్గెట్ చేశార‌ని, అంటూ.. రాష్ట్రంలో ఇంత‌మంది ద‌ళిత వ‌ర్గానికి చెందిన మంత్రులు ఉండి కూడా ఏ ఒక్కరూ త‌న అరెస్టును ఖండించ‌లేద‌ని అన్నారు.

ఇమేజ్ పెరిగిందా..?

మొత్తానికి ఈ ఎపిసోడ్‌కు తెర‌ప‌డినా…దీనికి తాలూకు లాభ న‌ష్టాల‌పై లెక్కల‌కు మాత్రం ముడిప‌డ‌లేదు. ఈ మొత్తం వ్యవ‌హారంతో జ‌న‌సేన గ్రాఫ్ స్వల్పంగా పెరిగింద‌నే కొత్త అంచ‌నాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు ఏకైక ఎమ్మెల్యే ఉన్న జ‌న‌సేన ఏంచేస్తుంద‌నే వ్యాఖ్యలు వినిపించేవ‌ని, అయితే, ఇప్పుడు ఈ పార్టీ ఏ స‌మ‌స్యనైనా ప‌రిష్కరించే రేంజ్‌లో ఉంద‌ని, ఏ జరిగినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వెంట‌నే రంగంలోకి దిగుతాడ‌నే సంకేతాలు కూడా పంపింద‌ని అంటున్నారు. రాపాక ఘ‌ట‌న త‌ర్వాత జ‌న‌సేన‌లో ధైర్యం పెరిగింద‌ని ఆ పార్టీ నాయ‌కులే విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. తాజాగా రాజ‌ధాని మారిస్తే కూడా ఉద్యమిస్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేసిన ప్రక‌ట‌న అటు ఆ పార్టీ కేడ‌ర్‌తో పాటు ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన ఫ్యూచ‌ర్‌పై కొత్త ఆశ క‌లిగిస్తోంది. మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ దీనిని నిలుపుకుంటారో ? లేదో ? చూడాలి.

Tags:    

Similar News