Pawan kalyan : గ్యాప్ అలా కంటిన్యూ చేస్తున్నారుగా?

రాజకీయాల్లో నిరంతరం ఉండేవాళ్లే మనగలుగుతారు. ప్రజలతో ప్రయాణించేవాళ్లకే పాలిటిక్స్ లో ఫ్యూచర్ ఉంటుంది. ఈ రెండు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేవు. ఏడు పదుల [more]

Update: 2021-10-22 14:30 GMT

రాజకీయాల్లో నిరంతరం ఉండేవాళ్లే మనగలుగుతారు. ప్రజలతో ప్రయాణించేవాళ్లకే పాలిటిక్స్ లో ఫ్యూచర్ ఉంటుంది. ఈ రెండు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేవు. ఏడు పదుల వయసులో చంద్రబాబు ఇప్పటికీ అధికార పార్టీ పైన పోరాటం చేస్తున్నారు. దీక్షలకు దిగుతున్నారు. పోరాటాలు చేస్తున్నారు. కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి తళుక్కున మెరిసి మాయమయిపోయేలా పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్నారు. ఇది అందరూ ఊహించిందే.

హడావిడి చేసి..

ఈ నెల 2వ తేదీన ఏపీలో పవన్ కల్యాణ‌్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రాజమండ్రిలో, అనంతపురంలో ఆయన సభలు పెట్టడం, రోడ్లపై గుంతలు పూడ్చడం వంటి కార్యక్రమాలతో పార్టీలో జోష్ ను నింపారు. ఇక అధికార పార్టీపై విమర్శల విషయంలో ఏమాత్రం తగ్గలేదు. తాను లేస్తే మనిషిని కాదని హెచ్చరించారు. తనతో పెట్టుకోవద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సమస్యలను తాను ఎప్పటికప్పుడు అడ్రెస్ చేస్తానని చెప్పుకొచ్చారు.

కాపులకు పిలుపు నిచ్చి….

ఇక రాష్ట్రంలో కాపులంతా ఏకం కావాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలన్నీ ఏకమవ్వాలన్నారు. తాను అవసరమైతే పెద్దలతో కలసి సమస్యలపై చర్చిస్తానని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలని ఆయన ఇచ్చిన పిలుపునకు బాగానే స్పందన కన్పించింది. అయితే ఆ మరుసటి రోజు నుంచే పవన్ కల్యాణ్ ఆ ఊసు మర్చిపోయారనిపిస్తుంది. తిరిగి ఆయన షూటింగ్ హడావిడిలో పడిపోయారు.

మిగిలిన పార్టీలు…

ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మిగిలిన పార్టీలు కాంగ్రెస్ తో సహా అన్నీ పోరాట బాట పట్టాయి. కానీ పవన్ కల్యాణ‌్ మాత్రం సీజనల్ పాలిటిక్స్ చేస్తుండటం పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని కొన్ని ఏళ్లుగా చెబుతున్నా ఇంతవరకూ పవన్ కల్యాణ్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పవన్ కల్యాణ‌్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి హడావిడి చేయాలంటే మరికొంత కాలం వెయిట్ చేయకతప్పదని జనసేన పార్టీలోనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News