Janasena : ఫోకస్ దానిపైనే… పొత్తు కుదిరితే?

బహుశ ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక కూడా నామమాత్రం కావడంతో ప్రధాన పార్టీల దృష్టి ఇక వచ్చే ఎన్నికలపైనే [more]

Update: 2021-10-11 00:30 GMT

బహుశ ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక కూడా నామమాత్రం కావడంతో ప్రధాన పార్టీల దృష్టి ఇక వచ్చే ఎన్నికలపైనే ఉండనుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. పొత్తుల సంగతి పక్కన పెడితే ఆయన ముందుగా తన సొంత సామాజికవర్గాన్ని బుజ్జగించాల్సి ఉంది. వారికి కొన్ని హామీలు ఇవ్వాల్సి ఉంటుంది.

జిల్లాల వారీగా సమావేశాలు….

కాపులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని జనసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేరుగా ఈ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరు కాకపోవచ్చు. పవన్ వీడియో సందేశం పంపేలా ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు హాజరయ్యే అవకాశాలున్నాయి. కాపులకు రిజర్వేషన్ల సమస్య చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది. అయితే తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని కాపులకు హామీ ఇచ్చే అవకాశాలు జనసేన నుంచి ఉంటాయి.

టీడీపీతో పొత్తు ఉన్నా…

ప్రధానంగా కాపులను తమ దారికి తెచ్చుకుంటేనే జనసేన కు వచ్చే ఎన్నికల్లో కొంత వరకైనా ఫలితం ఉంటుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా తాము ఖచ్చితంగా మెడలు వంచి కాపుల ప్రయోజనాలను కాపాడతామని గట్టి హామీలు ఈ సమావేశాల్లో జనసేన ఇచ్చే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. దసరా తర్వాత ఈ సమావేశాలు జరిగే అవకాశముందని తెలుస్తోంది.

కీలకంగా మారొచ్చని….

జనసేన, టీడీపీ పొత్తు దాదాపు ఖరారయినట్లేనన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కాపులను ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తే టీడీపీ నుంచి సీట్లు కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. యాభై నుంచి నలభైకు తగ్గకుండా పోటీ చేయాలన్నది పవన్ కల్యాణ్ అభిప్రాయంగా ఉంది. దీంతో ఆ నలభై స్థానాల్లో పొత్తుతో జనసేన జెండా ఎగిరినా తామ క్రియాశీలంగా మారతామన్న విశ్వాసంతో జనసేన ఉంది. మొత్తం మీద కాపుల సమావేశాలతో ఏపీ రాజకీయాలను జనసేనాని మరింత హీటెక్కించనున్నారు.

Tags:    

Similar News